తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ | - | Sakshi
Sakshi News home page

తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ

Oct 15 2026 11:35 AM | Updated on Oct 15 2026 11:35 AM

తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ షాద్‌నగర్‌: బతుకమ్మ పండుగ తెలంగాణ సంస్కృతికి ప్రతీక అని తెలంగాణ జాగృతి రాష్ట్ర అధ్యక్షురాలు మాధవి అన్నారు. పట్టణంలోని ఏ వన్‌ గార్డెన్‌ ఫంక్షన్‌ హాల్‌లో జాగృతి జిల్లా అధ్యక్షుడు మొయినుద్దీన్‌ ఆధ్వర్యంలో బుధవారం బతుకమ్మ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మాధవి మాట్లాడుతూ.. ఇక్కడి ప్రజల జీవన విధానాన్ని, ఐక్యతను, సాంస్కృతిక వైభవాన్ని చాటి చెప్పే పూల పండుగే బతుకమ్మ అన్నారు. కార్యక్రమంలో మహిళా సమాఖ్య మండల అధ్యక్షురాలు అరుంధతి, నాయకులు శంకర్‌, అమృత, రమ్య, కరుణ, లావణ్య, అనిత, విజయ, అమరావతి, అనురాధ, లావణ్య, నస్రీన్‌ తదితరులు పాల్గొన్నారు. ఎవరో లక్కీ

● బార్ల కేటాయింపునకు డ్రా రేపు

● కలెక్టర్‌ సమక్షంలో కొనసాగనున్న ప్రక్రియ

చేవెళ్ల: జిల్లాలోని నూతన బార్లకు సంబంధించిన లక్కీ డ్రాను శుక్రవారం నిర్వహించనున్నట్లు ప్రొహిబిషన్‌ అండ్‌ ఎకై ్సజ్‌ ఫ్యూచర్‌ సిటీ జిల్లా సూపరింటెండెంట్‌ శ్రీనివాస్‌రెడ్డి, చేవెళ్ల ఎకై ్సజ్‌ ఇన్‌స్పెక్టర్‌ కల్పన తెలిపారు. ప్యూచర్‌సిటీ పరిధిలో నూతనంగా ఏర్పడిన చేవెళ్ల, మొయినాబాద్‌ మున్సిపాలిటీల్లో.. చేవెళ్ల పరిఽధిలో ఒకటి, మొయినాబాద్‌ పరిధిలో రెండు బార్లకు అనుమతి వచ్చిందన్నారు. చేవెళ్లలోని బార్‌కు మొత్తం 279 దరఖాస్తులు రాగా మొయినాబాద్‌లోని రెండు బార్లకు ఏకంగా 664 అప్లికేషన్లు వచ్చినట్లు తెలిపారు. దరఖాస్తు చేసుకున్న వారి వివరాలతో లక్కీ డ్రా నిర్వహిస్తామన్నారు. అజీజ్‌నగర్‌లోని పీవీ కన్వెన్షన్‌ హాల్‌లో ఉదయం 9:30 గంటలకు నిర్వహించే కార్యక్రమానికి కలెక్టర్‌ నారాయణరెడ్డి హాజరవుతారన్నారు. టెండర్లకు హాజరయ్యే వారు ఎంట్రీ పాస్‌ కలిగి ఉండాలని, పాస్‌ ఉన్నవారిని మాత్రమే లోనికి అనుమతిస్తారని తెలిపారు. అభ్యర్థుల తరఫున వారి ప్రతినిధులు హాజరు కావాలనుకుంటే అధికారిక అనుమతి ప్రతం ఉండాలన్నారు. ఫంక్షన్‌ హాల్‌లోనికి మొబైల్‌ ఫోన్లు అనుమతించరని స్పష్టంచేశారు. అభ్యర్థులు నిర్ణీత సమయానికి హాజరు కావాలని సూచించారు.

ముగిసిన రాష్ట్రస్థాయి తైక్వాండో పోటీలు

జాతీయ స్థాయి పోటీలకు 26మంది

క్రీడాకారులు

పరిగి: పట్టణంలోని మినీ గ్రౌండ్‌లో మూడు రోజులుగా జరుగుతున్న అండర్‌ –17 బాలబాలికల రాష్ట్రస్థాయి తైక్వాండో పోటీలు బుధవారంతో ముగిశాయి. రాష్ట్రంలోని పది జిల్లాల నుంచి 260 మంది క్రీడాకారులు వివిధ విభాగాల్లో పాల్గొన్నారు. 26మంది బంగారు పతకాలు సాధించి జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. బాలుర విభాగంలో అబిద్‌ అలీ(రంగారెడ్డి), దినేష్‌సింగ్‌(హైదరాబాద్‌), అబ్దుల్‌ మక్‌సిత్‌(నల్లగొండ), ఎస్‌కే అనాస్‌(నిజామాబాద్‌), కార్తీక్‌ సాయి రాథోడ్‌(హైదరాబాద్‌), హర్ష్‌(నిజామాబాద్‌), అనుదీప్‌రెడ్డి(రంగారెడ్డి), అమాన్‌సింగ్‌(నిజామాబాద్‌), మహ్మద్‌ అదిల్‌(నల్లగొండ), ఎండీ సఫ్రోజ్‌(రంగారెడ్డి), విశ్వన్హు(హైదరాబాద్‌), వివేక్‌సింగ్‌(హైదరాబాద్‌), అభినవ్‌రెడ్డి(రంగారెడ్డి), బాలికల విభాగంలో హన్షిని(రంగారెడ్డి), రితికా(రంగారెడ్డి), లక్షితా(రంగారెడ్డి), వైష్ణవిరెడ్డి(హైదరాబాద్‌), హసిని(రంగారెడ్డి), హర్షిని(రంగారెడ్డి), అఖిలారెడ్డి(రంగారెడ్డి), ప్రియాన్షిరెడ్డి(రంగారెడ్డి), నియోజాతా(నల్లగొండ), ఖ్యాతిచౌదరి(హైదరాబాద్‌), సాయి అవంతిక(హైదరాబాద్‌), నిహావైష్ణవి(నిజామాబాద్‌), అమూల్య(హైదరాబాద్‌) బంగారు పతకాలు సాధించారు. వీరు ఈ నెల 22 నుంచి 26వ తేదీ వరకు జమ్ము కాశ్మీర్‌ రాష్ట్రం శ్రీనగర్‌లో జరిగే జాతీయ స్థాయి పోటీల్లో తెలంగాణ తరఫున ఆడనున్నట్లు వ్యాయమ ఉపాధ్యాయులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement