బడంగ్పేట్: రెండు నెలలకుపైగా కొనసాగిన సర్ ప్రక్రియ నవంబర్ 9 వరకు మూడోసారి గడువు పెంచినప్పటికీ 90 శాతం వరకు పూర్తి చేశారని చెప్పొచ్చు. బడంగ్‌పేట సర్కిల్ కింద ప్రశాంతిహిల్స్, జిల్లెలగూడ, మీర్పేట్, నాదర్గుల్, బడంగ్పేట్, బాలాపూర్ డివిజన్లు ఉన్నాయి. 138 పోలింగ్ స్టేషన్ల కింద మొత్తంగా 1.62 లక్షల ఓటర్లు ఉన్నారు. ప్రతీ ఓటరుకు ఎన్యూమరేషన్ ఫారాలను అందజేశారు. సర్ ప్రక్రియలో 138 మంది బీఎల్ఓలు, 14 మంది సూపర్వైజర్లు, 8 మందిని అడిషనల్ ఇన్చార్జులుగా ఉండి సర్‌ను వేగవంతంగా పూర్తిచేసేందుకు నియమించారు. ఎన్యూమరేషన్ ఫారాలను ఇంటింటికీ తిరిగి పంపిణీ చేసినప్పటికీ ఆగస్టు 17 నాటికి 80 వేల మంది ఓటర్లు మాత్రమే రెస్పాండ్ అయి ఫారాలను నింపి తిరిగి బీఎల్ఓలకు అందజేశారు. ఇంటి పేరు, తండ్రి పేరు, నివాస స్థలం తన పేరు ఇలా రకరకాల కారణాలతో ఓటర్లను డ్రాఫ్టింగ్‌లో చేర్చి రెండోసారి 47 వేల మందికి ఓటర్లకు నోటీసులు అందజేశారు. నోమ్యాపింగ్ కింద 28 వేల మందిని చేర్చారు. అందులో 38 వేల మంది రెస్పాండ్ అయి ఓటును కోల్పోకుండా సరైన ఆధారాలు, రుజువులు, వివరణ ఇచ్చుకున్నారు. బీఎల్ఓలు ఎన్నిసార్లు ఫోన్లు చేసినా, ఇంటింటికీ వెళ్లి వివరణ కోరినా ఇంకా తొమ్మిదివేల మంది స్పందించలేదని అధికారులు చెబుతున్నారు. కేంద్రం తీసుకొచ్చిన సర్ కార్యక్రమం వెనక జీహెచ్ఎంసీ బడంగ్‌పేట సర్కిల్ కార్యాలయ సిబ్బందితో పాటు రెవెన్యూ సిబ్బంది, పొదుపు సంఘాల సభ్యులు ఇలా చాలా మంది కష్టం దాగున్నదని తెలుస్తోంది. ఇదిలా కొనసాగుతుంటే.. బీజేపీ కేంద్ర సర్కార్ కావాలనే ఎన్నికల ప్రధాన అధికారితో కుమ్మకై ్క పేదోడి పౌరసత్వంగా ఉన్న ఓటు హక్కును చోరీ చేస్తోందని ఢిల్లీలో ధర్నాలు, నిరసన సెగలు చేపడుతున్న విషయం తెలిసిందే. మంచికో చెడుకో తెలియదు కానీ సర్ ప్రక్రియ మాత్రం దేశాన్ని కుదిపేసి నేడు హాట్ టాపిక్‌గా మారిందని చెప్పొచ్చు.
నోటీసులకు స్పందించని
తొమ్మిది వేల మంది


