ఇన్‌స్పైర్‌ పోటీలకు నాలుగు ప్రాజెక్టుల ఎంపిక | - | Sakshi
Sakshi News home page

ఇన్‌స్పైర్‌ పోటీలకు నాలుగు ప్రాజెక్టుల ఎంపిక

Oct 14 2026 11:22 AM | Updated on Oct 14 2026 11:22 AM

ఇన్‌స్పైర్‌ పోటీలకు నాలుగు ప్రాజెక్టుల ఎంపిక వ్యవసాయానికి నిరంతర విద్యుత్‌ సరఫరా చేయాలి మాల్‌ నుంచి ఐఎస్‌ సదన్‌కు మెట్రో డీలక్స్‌ బస్సులు ప్రత్యేక వాహన తనిఖీలు

బడంగ్‌పేట్‌: కేంద్ర ప్రభుత్వ శాస్త్ర సాంకేతిక మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో ఏటా ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఇన్‌స్పైర్‌ అవార్డ్స్‌ మనక్‌ జాతీయ స్థాయి పోటీలకు జిల్లా నుంచి నాలుగు ప్రాజెక్ట్‌లు ఎంపికై నట్లు జిల్లా సైన్స్‌ అధికారి వై.శ్రీనివాస్‌రావు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఢిల్లీ ప్రగతి మైదాన్‌లోని భారత్‌ మండపం వేదికగా ఈనెల 14న ప్రదర్శన ఉంటుందని, ఇందులో 60 శాతం ఉత్తమ ప్రాజెక్టులను ఎంపిక చేసి బహుమతులు అందజేస్తారని తెలిపారు. జిల్లా నుంచి ఎంపికై న ప్రాజెక్టుల్లో స్మార్ట్‌ క్రాడిల్‌ బేబి మానిటరింగ్‌, హార్ట్‌ సేఫర్‌ జాకెట్‌, ఆటోమెటిక్‌ టాయిలెట్‌ మిషన్‌, స్మార్ట్‌ షూస్‌ ఫర్‌ ది విజువల్లీ ఇన్‌పెర్డ్‌ ఉన్నట్లు చెప్పారు.

షాద్‌నగర్‌: ప్రభుత్వం వ్యవసాయానికి నిరంతర విద్యుత్‌ సరఫరా చేయాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బుద్దుల జంగయ్య డిమాండ్‌ చేశారు. పట్టణంలోని పెన్షనర్స్‌ భవనంలో మంగళవారం బీకేఎంయూ సంఘం కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యుత్‌ కోతల కారణంగా రైతులు పండించిన పంటలు ఎండిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. పంట చేతికొచ్చే సమయంలో విద్యుత్‌ కోతలు విధించడం సరికాదన్నారు. సిద్ధాపూర్‌లో డంప్‌ యార్డు నిర్మించేందుకు ప్రభుత్వం జారీ చేసిన 641 జీఓను వెంటనే రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం పేదలకు ఇచ్చిన ఆరు గ్యారంటీల హామీని వెంటనే అమలు చేయాలన్నారు. ఈ సందర్భంగా సంఘం డివిజన్‌ నూతన కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా జిల్లెల వెంకటేశ్‌, కార్యనిర్వాహక అధ్యక్షుడిగా రమేష్‌, ఉపాధ్యక్షులుగా రాములు, యాదయ్య, ప్రధాన కార్యదర్శిగా రాజు నాయక్‌, సహాయ కార్యదర్శులుగా భూపాల్‌, లింగమయ్య ఎన్నికయ్యారు.

ఇబ్రహీంపట్నం: మాల్‌ నుంచి ఐఎస్‌ సదన్‌ (హైదరాబాద్‌) వరకు అరగంటకు ఒకటి చొప్పున మెట్రో డీలక్స్‌ బస్సులు నడపుతున్నట్లు ఇబ్రహీంపట్నం డిపో మేనేజర్‌ సుజాత మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. స్థానిక డిపోకు చెందిన బస్సులు నడుస్తాయని, ఆయా ప్రాంతాల ప్రయాణికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

ఇబ్రహీంపట్నం: డ్రైవింగ్‌ లైసెన్స్‌లు లేకుండా వాహనాలు నడుపుతున్న వారిపై నిఘా పెంచేందుకు మంగళవారం ఇబ్రహీంపట్నంలో ట్రాఫిక్‌ పోలీసులు ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా సుమారు 12 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. అందులో ఓ మైనర్‌ కూడా వాహనం నడుపుతున్నట్లు ట్రాఫిక్‌ సీఐ జితేందర్‌రెడ్డి తెలిపారు. పట్టుబడిన వారికి కౌన్సెలింగ్‌ ఇచ్చామని, చట్టపరంగా న్యాయస్థానం ఎదుట హాజరుపర్చడానికి చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. స్థానిక అంబేడ్కర్‌ చౌరస్తాలో విద్యార్థులు, వాహనచోదకులకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. స్థానిక ఎస్‌హెచ్‌ఓ మహేందర్‌రెడ్డి, ట్రాఫిక్‌ సీఐ జితేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. డ్రైవింగ్‌ లైసెన్స్‌ లేకుండా వాహనాలు నడిపితే చట్టరీత్యా చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రతి ఒక్కరూ హెల్మెట్‌ ధరించాలని, ట్రిపుల్‌ రైడింగ్‌ చేయొద్దని, మద్యం తాగి వాహనాలు నడపొద్దని, రాంగ్‌ రూట్‌లో ప్రయాణం చేయొద్దని సూచించారు. మైనర్లు వాహనాలు నడపకుండా తల్లిదండ్రులు బాధ్యతగా వ్యవహరించాలన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement