అనుమానంతోనే హత్య | - | Sakshi
Sakshi News home page

అనుమానంతోనే హత్య

Oct 14 2026 11:22 AM | Updated on Oct 14 2026 11:22 AM

పహాడీషరీఫ్‌: భార్యను కిరాతకంగా గొంతుకోసి హత్య చేసిన కేసులో నిందితుడిని బాలాపూర్‌ పోలీసులు అరెస్ట్‌ చేసి మంగళవారం రిమాండ్‌కు తరలించారు. అనుమానం కారణంగానే హత్యకు పాల్పడినట్లు విచారణలో వెల్లడైంది. పోలీస్‌స్టేషన్‌లో మంగళవారం రాత్రి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఇన్‌స్పెక్టర్‌ జి.నాగరాజుతో కలిసి ఆదిభట్ల డివిజన్‌ ఏసీపీ డి.వి.ప్రదీప్‌ కుమార్‌ రెడ్డి వివరాలు వెల్లడించారు. పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రానికి చెందిన అజ్మీరా బేగం (28), మహ్మద్‌ ముస్తఫా (29) భార్యాభర్తలు. వీరికి ముగ్గురు మగ పిల్లలు సంతానం. రెండేళ్ల క్రితం బతుకుదెరువు నిమిత్తం జల్‌పల్లిలోని న్యూబాబానగర్‌కు వలస వచ్చారు. అజ్మీరా బేగం ఫంక్షన్‌హాళ్లలో పని చేస్తుండగా, ముస్తఫా అడపదడపా కూలీ పని చేస్తూ జులాయిగా తిరిగేవాడు. కొన్ని రోజుల నుంచి భార్య ఇతరులతో ఫోన్‌ మాట్లాడుతుందని అనుమానం పెంచుకున్నాడు. ఈ క్రమంలోనే సోమవారం రాత్రి ఆమెతో గొడవపడ్డాడు. కోపోద్రిక్తుడై కత్తితో భార్య గొంతుకోసి ఇంట్లో నుంచి పరారయ్యాడు. ఈ ఘటనను చూసిన కుమారుడు బోరున విలపించడం, నిందితుడు రక్తపు బట్టలతో పారిపోతుండడాన్ని గమనించిన స్థానికులు సమీపంలోనే ఉన్న అజ్మీరా బేగం తల్లి, సోదరికి సమాచారం అందించారు. వారు వచ్చి చూసేసరికి ఆమె మృతి చెందింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మంగళవారం మధ్యాహ్నం ఎయిర్‌పోర్ట్‌ హోటల్‌ సమీపంలో నిందితుడిని అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. రక్తపు మరకలు కలిగిన దుస్తులతో పాటు నిందితుడి నుంచి కత్తి, సెల్‌ఫోన్‌ స్వాధీనం చేసుకున్నారు.

● భార్యను అంతమొందించిన కేసులో నిందితుడి అరెస్ట్‌

● వివరాలు వెల్లడించిన ఆదిభట్ల ఏసీపీ ప్రదీప్‌ కుమార్‌ రెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement