బతుకమ్మ వేడుకల పోస్టర్‌ ఆవిష్కరణ | - | Sakshi
Sakshi News home page

బతుకమ్మ వేడుకల పోస్టర్‌ ఆవిష్కరణ

Oct 14 2026 11:22 AM | Updated on Oct 14 2026 11:22 AM

ఇబ్రహీంపట్నం రూరల్‌: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచిన బతుకమ్మను సంబరంగా జరుపుకోవాలని కలెక్టర్‌ సి. నారాయణరెడ్డి పేర్కొన్నారు. వేడుకలకు సంబంధించిన పోస్టర్‌ను మంగళవారం అదనపు కలెక్టర్‌ కిరణ్మయితో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. బతుకమ్మ పండగకు ఎంతో విశిష్టమైన ప్రాధాన్యత ఉందని తెలిపారు. మహిళల ఐక్యతకు, ప్రకృతి ఆరాధనకు ప్రతీకగా నిలిచే పండగను ప్రతి ఒక్కరూ ఉత్సాహంగా జరుపుకోవాలని ఆకాక్షించారు. టీజీఓల సంఘం జిల్లా మహిళా విభాగం చైర్మన్‌ రేవతి మాట్లాడుతూ.. ఈ నెల 14న టీజీఓ భవన్‌ హైదరాబాద్‌లో రాష్ట్రస్థాయి సంబరాలు, 15న జిల్లా ఐడీఓసీ కార్యాలయ ప్రాంగణంలో జిల్లాస్థాయి వేడుకలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. మహిళా ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో సంఘం అధ్యక్ష, కార్యదర్శులు రామారావు, శ్రీనేష్‌కుమార్‌ నోరీ, మహిళా విభాగం కోశాధికారి శాంతిశ్రీ, సైదమ్మ, బాలేశ్వరి, రాణి, రాకేష్‌, మహేశ్‌, ఐశ్వర్య, స్వప్న, సంధ్య, జ్యోత్స్న, ప్రమీల, లావణ్య, స్వాతి, పద్మాంజలి, సమంత, శ్రీదేవి, మైతిలి, రాజ్యలక్ష్మి, రజిత, కరుణ, రవాణి, భాను, పుల్లమ్మ, ప్రశాంతి, మమత, శ్రీలత, భవాని తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement