అండర్‌–17 క్రికెట్‌ విజేత జిల్లా జట్టు | - | Sakshi
Sakshi News home page

అండర్‌–17 క్రికెట్‌ విజేత జిల్లా జట్టు

Oct 14 2026 11:22 AM | Updated on Oct 14 2026 11:22 AM

సిరిసిల్లఅర్బన్‌: రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని రంగినేని సుజాత మోహన్‌రావు ట్రస్ట్‌ మైదానంలో నిర్వహించిన అండర్‌–17 రాష్ట్రస్థాయి బాలికల క్రికెట్‌ పోటీలు మంగళవారంతో ముగిశాయి. పోటీల్లో విజేతగా రంగారెడ్డి జట్టు నిలిచింది. రన్నరప్‌గా మెదక్‌, మూడో స్థానంలో హైదరాబాద్‌, నాలుగో స్థానంలో కరీంనగర్‌ జట్లు నిలిచాయి. గెలుపొందిన జట్లకు సిరిసిల్ల మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ జిందం కళచక్రపాణి, డీఈవో విజయ్‌సాగర్‌ ట్రోఫీలు అందజేశారు. ఈ సందర్భంగా చైర్‌పర్సన్‌ మాట్లాడుతూ.. బాలికలు క్రీడలతోపాటు అన్ని రంగాల్లో రాణించాలన్నారు. గ్రామీణ బాలికల్లో ఉన్న నైపుణ్యాన్ని వెలికి తీయడానికి ఇలాంటి పోటీలు దోహదపడతాయని పేర్కొన్నారు. బాలికలు రాష్ట్ర, జాతీయ స్థాయిలో పోటీపడి మంచి గుర్తింపు పొందాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ట్రస్ట్‌ స్కూల్‌ ప్రిన్సిపాల్‌ తుడి వెంకట్రావు, జిల్లా క్రీడలశాఖ అధికారి అజ్మీర రాందాస్‌, ఎస్‌జీఎఫ్‌ కార్యదర్శి రవీందర్‌రావు, కోచ్‌లు పాల్గొన్నారు.

జాతీయస్థాయి పోటీలకు ఎంపిక

అండర్‌–17 బాలికల రాష్ట్రస్థాయి క్రికెట్‌ పోటీల్లో ఉమ్మడి పది జిల్లాల నుంచి పలువురు బాలికలు సత్తాచాటి జాతీయస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. వారిలో మన జిల్లాకు చెందిన జయ, వేద, యక్షారెడ్డి, రుద్రాక్షర, స్టాండ్‌ బైగా నిధిచంద్ర ఉన్నారు. వీరు నవంబర్‌ మొదటి వారంలో జమ్మూకశ్మీర్‌లో జరిగే జాతీయ పోటీల్లో పాల్గొంటారని ఎస్‌జీఎఫ్‌ కార్యదర్శి జోగిపల్లి రవీందర్‌రావు తెలిపారు.

రాజన్న సిరిసిల్లలో ముగిసిన రాష్ట్రస్థాయి బాలికల పోటీలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement