ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి
శంకర్‌పల్లి: మండలంలో సర్పంచ్ ఎన్నికలు సజావుగా సాగేందుకు ప్రతి ఒక్క అభ్యర్థి సహకరించాలని ఎంపీడీఓ వెంకయ్య అన్నారు. ఆదివారం మండల పరిషత్ కార్యాయలంలో సర్పంచ్ అభ్యర్థులు, అధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు సర్వం సిద్ధం చేశామన్నారు. అదేవిధంగా గ్రామాల్లో సర్పంచ్ పదవికి పోటీ చేసే అభ్యర్థులంతా స్నేహపూర్వకంగా ఉండాలన్నారు. శంకర్‌పల్లి, మోకిల సీఐలు శ్రీనివాస్‌గౌడ్, వీరబాబు మాట్లాడుతూ.. శాంతి భద్రతలకు ఎక్కడ విఘాతం కలిగిన కఠిన చర్యలుంటాయని, ఓటర్లను బెదిరించడం, భయపెట్టడం చేయొద్దన్నారు. ప్రచార వాహనాల కోసం తహసీల్దార్ అనుమతి తీసుకోవాలని, సౌండ్ సిస్టం కోసం తమను సంప్రదిస్తే పరిశీలిస్తామని స్పష్టం చేశారు. అదేవిధంగా పోటీలో గెలుపొందిన తర్వాత విజయోత్సవ ర్యాలీలు తీసేవారు 48 గంటల ముందు తప్పనిసరిగా పోలీసుల అనుమతి తీసుకోవాలని సూచించారు.
ఎంపీడీఓ వెంకయ్య


