ఎన్నికల నిబంధనలు పాటించాలి
మొయినాబాద్‌రూరల్: పంచాయతీ ఎన్నికల్లో స ర్పంచులు, వార్డు సభ్యులుగా పోటీ చేస్తున్న అభ్యర్థులు నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని సీఐ పవన్‌కుమార్‌రెడ్డి, మండల ఎన్నికల పరిశీలకుడు ఫిరోజ్‌ఖాన్ అన్నారు. ఆదివారం మండలంలో అభ్యర్థులతో ఎన్నికల ఖర్చులపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ, ఎన్నికల పరిశీలకుడు మాట్లాడుతూ.. ఎన్నికల నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవన్నారు. వాల్‌పోస్టర్, బ్యానర్లు, మైక్ స్పీచ్‌లు, ర్యాలీలు అన్నింటికి పర్మిషన్లు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో పోటీలో ఉన్న అభ్యర్థులు తదితరులు పాల్గొన్నారు.


