ఓటమి.. గెలుపునకు నాంది
శంకర్‌పల్లి: క్రీడల్లో గెలుపోటములు సహజమని, ఓటమి గెలుపునకు నాంది కావాలని మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కాశెట్టి చంద్రమోహన్ అన్నారు. ఆదివారం మున్సిపాలిటీ పరిధిలోని ఫత్తేపూర్‌లో హెచ్‌ఆర్ బ్యాడ్మింటన్ అకాడమీ ఆధ్వర్యంలో ఓపెన్ టూ ఆల్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ నిర్వహించగా.. సంగారెడ్డికి చెందిన విశాల్, శివ విన్నర్‌గా, శంకర్‌పల్లికి చెందిన ప్రభాకర్, తిరుపతిరెడ్డిలు రన్నరప్‌గా నిలిచారు. ఈ సందర్భంగా ఆయన ముఖ్య అతిథిగా హాజరై, విజేతలకు బహుమతులను ప్రదానం చేశారు. కార్యక్రమంలో సురేశ్, రఘునందన్‌రెడ్డి, నర్సింహారెడ్డి, మాణిక్‌రెడ్డి, రాంరెడ్డి, తిరుపతిరెడ్డి పాల్గొన్నారు.
మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ చంద్రమోహన్


