కాంగ్రెస్ మద్దతుదారులను గెలిపించండి
కొత్తూరు: సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపర్చిన అభ్యర్థులను గెలిపించాలని ఎమ్మెల్యే శంకర్ కోరారు. ఆదివారం మండలంలోని గూడూరు, తీగాపూర్, మల్లాపూర్, నందిగామ మండలంలోని అప్పారెడ్డిగూడ, వీర్లపల్లి, వెంకమ్మగూడ, చేగూరు, నందిగామ గ్రామాల్లో పర్యటించి అభ్యర్థుల తరఫున ప్రచారం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. అందరికి అందుబాటులో ఉండి గ్రామాభివృద్ధి కోసం కృషి చేసే అభ్యర్థులను అధిక మెజార్టీతో గెలిపించాలని అభ్యర్థించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరికి ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను వర్తింపచేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో సర్పంచు అభ్యర్థులు, నాయకులు శివశంకర్‌గౌడ్, సుదర్శన్‌గౌడ్, సురేందర్, శ్రీనివాస్, బాబార్‌ఖాన్ తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్


