గ్రామస్థాయిలో బలోపేతం
చేవెళ్ల: బీజేపీ గ్రామ స్థాయి వరకు బలోపేతం అవుతోందని చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి అన్నారు. మున్సిపల్ కేంద్రంలో ఆదివారం పార్టీ మున్సిపాలిటీ అధ్యక్షుడు అనంత్‌రెడ్డి ఆధ్వర్యంలో మున్సిపల్ పరిధిలోని దేవునిఎర్రవల్లి నుంచి పలువురు కాంగ్రెస్, బీఆర్‌ఎస్ నాయకులు ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం ఆధ్వర్యంలో బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా వారికి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. అనంతరం ఎంపీ మాట్లాడుతూ.. రాబోయే రోజుల్లో పార్టీ మరింత బలం పెంచుకుంటుందన్నారు. ప్రస్తుతం జరుగుతున్న సర్పంచ్ ఎన్నికల్లో పార్లమెంట్ పరిధిలో బీజేపీ మద్దతుతో అభ్యర్థులు ఎక్కడ గెలిచినా ఆ గ్రామానికి ఎంపీ నిధుల నుంచి రూ.10 లక్షల నిధులు ఇస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు డాక్టర్ మల్గారి వైభవ్‌రెడ్డి, బీఎస్‌ఎన్‌ఎల్ బోర్డు సభ్యుడు సామ మాణిక్యరెడ్డి, శర్వలింగం, శ్రీనివాస్, తిరుపతిరెడ్డి, సత్యనారాయణ, రా జు, శ్రీకాంత్‌రెడ్డి, వెంకటేశ్, అభిషేకర్‌రెడ్డి, మాణ య్య, చంద్రకాంత్, రవి, కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.


