
కత్తులు దూసిన కుటుంబ కలహాలు
● వ్యక్తికి తీవ్ర గాయాలు
● పోలీసుల అదుపులో నిందితులు
షాద్‌నగర్ రూరల్: కుటుంబ కలహా ల నేపథ్యంలో ఓ వ్యక్తిపై కత్తులతో దాడి చేసిన ఘటన శనివారం ఉదయం షాద్‌నగర్‌లో చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి.. పట్టణంలోని ఆశాకాలనీకి చెందిన కాంట్రాక్టర్ గంతల ప్రభుకు ఇద్దరు భార్యలు. మొదటి భార్య కుమా రుడు పృథ్వీరాజ్ తన కొడుకుతో కలిసి శనివారం ఉదయం బైక్‌పై పట్టణ శివారులోని ఓ డెయిరీ ఫాంకు వెళ్లి, పాలు తీసుకొని ఇంటికి వస్తున్నాడు. కేశంపేట రైల్వే గేటు మ లుపు వద్ద మాటువేసిన ప్రభు రెండో భార్య కుమారులు నందీశ్వర్, భరత్ అతనిపై కత్తులతో దాడి చేసి, పరారయ్యారు. ఇది గమనించిన స్థానికులు వెంటనే పోలీసుకు సమాచారం అందించారు. రక్త గాయా లతో కింద పడిన పృథ్వీరాజ్‌ను చికిత్స నిమిత్తం పట్టణంలోని ప్రభు త్వ కమ్యూనిటీ ఆస్పత్రికి తరలించారు. కుటుంబ గొడవలే దాడికి కారణమని బాధితుడు తెలిపాడు ఈ మేరకు కేసు నమోదు చేసి, నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు సీఐ విజయ్‌కుమార్ తెలిపారు.