
రాజీ కోసమే లోక్ అదాలత్‌లు
చేవెళ్ల: కోర్టుల్లో ఉన్న పెండింగ్ కేసులను రాజీమార్గం ద్వారా పరిష్కరించుకునేందుకు లోక్ అదాలత్‌లు ఉపయోగపడుతాయని చేవెళ్ల కోర్టు సీనియర్ సివిల్ జడ్జి దశరథ రామయ్య, జూనియర్ సివిల్ జడ్జి విజయ్‌కుమార్ ఉపాధ్యాయ, రిటైర్డు జడ్జి సాంబశివరావులు పేర్కొన్నారు. శనివారం కోర్టు ఆవరణలో లోక్ అదాలత్ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఈనెల 8వ తేదీ నుంచి 13వ తేదీ వరకు వివిధ రకాల కేసులు 1014 పరిష్కరించటంతోపాటుగా జరిమానా కింద రూ.24,18,300 విధించినట్లు తెలిపారు. అనుకోకుండా, క్షణికావేశంలో జరిగే గొడవలతో అనేక కేసులు వేసుకొని కోర్టుల చుట్టూ తిరుగుతున్న వారు ఎందరో ఉన్నారన్నారు. న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో కేసుల పరిష్కారం కోసం లోక్ అదాలత్‌లను తీసుకు వచ్చి అనేక కేసులను పరిష్కరించామన్నారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి, ఉపాధ్యక్షులు క్రిష్ణగౌడ్, నర్సింలు, ప్రధాన కార్యదర్శి మహేశ్‌గౌడ్, సంయుక్త కార్యదర్శి యాదగిరి, ఏజీపీ గీతావనజాక్షి, ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ ప్రకాశం, శివరాజ్, సీనియర్ సూపరింటిండెంట్ యాదయ్య, న్యాయవాదులు క్రిష్ణవేణి, ఇందిర, పాండురంగారెడ్డి, చంద్రశేఖర్, కుమార్, అభిలాష్‌రెడ్డి, పోలీస్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
ముందుకు రావాలని జడ్జీల సూచన