డిగ్రీ కోర్సుల్లో చేరికకు దరఖాస్తుల ఆహ్వానం | - | Sakshi
Sakshi News home page

డిగ్రీ కోర్సుల్లో చేరికకు దరఖాస్తుల ఆహ్వానం

Sep 14 2025 9:08 AM | Updated on Sep 14 2025 9:08 AM

డిగ్ర

డిగ్రీ కోర్సుల్లో చేరికకు దరఖాస్తుల ఆహ్వానం

డిగ్రీ కోర్సుల్లో చేరికకు దరఖాస్తుల ఆహ్వానం షాద్‌నగర్‌: పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో వివిధ కోర్సుల్లో మిగిలిపోయిన సీట్లకు స్పాట్‌ అడ్మిషన్ల కోసం అర్హులైన విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ కమల, దోస్త్‌ కన్వీనర్‌ పి.శ్రీనివాసులు శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కళాశాలలో బీకాం కంప్యూటర్‌ అప్లికేషన్స్‌, బీఎస్సీ, ఎంపీసీ, బీఎస్సీ ఎంపీసీఎస్‌, బీఏ ఈపీపీ, బీఏ హెచ్‌ఈపీ, బీఎస్‌సీ సీబీజెడ్సీ, బీఎస్సీసీ బీజెడ్సీ, సీఎస్‌, బీఎస్సీ బీజెడ్‌ఎస్‌ కోర్సులు ఉన్నట్లు తెలిపారు. రెండు విడుతల్లో స్పాట్‌ అడ్మిషన్ల ప్రక్రియ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఆసక్తిగల విద్యార్థులు ఎస్‌ఎస్‌సీ మెమో, ఇంటర్‌ టీసీ, మెమో, కులధ్రువీకరణ పత్రం, బోనఫైడ్‌, ఆధార్‌ ఒరిజినల్‌ సర్టి ఫికెట్లతో ఈనెల 16వతేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. 17న ఎంపికై న విద్యార్థుల జాబితా ప్రకటిస్తామన్నారు. 15,16 తేదీల్లో స్పాట్‌ అడ్మిషన్లు సురంగల్‌ పెద్ద చెరువుకు గండి కేటీఆర్‌తో మాజీ ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్‌ భేటీ

హయత్‌నగర్‌: హయత్‌నగర్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఖాళీ సీట్లను భర్తీ చేసేందుకు ఈ నెల 15,16 తేదీల్లో స్పాట్‌ అడ్మిషన్లు నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్‌ శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మొత్తం 176 సీట్లు ఖాళీగా ఉన్నాయని వాటిలో బీకాం కంప్యూటర్‌ అప్లికేషన్స్‌ కోర్సులో 21, బీఎస్సీ ఫిజికల్‌ సైన్సెస్‌లో 45, బీఎస్సీ లైఫ్‌సైన్స్‌లో 31, బీఏ తెలుగు మీడియంలో 40, బీబీఏలో 39 సీట్లు ఖాళీగా ఉన్నట్లు తెలిపారు. ఆసక్తి గల విద్యార్థులు తమ ఒరిజినల్‌ సర్టిఫికెట్లతో వచ్చి కళాశాల దోస్త్‌ కో ఆర్డినేటర్‌ నర్సింహను కలవాలని సూచించారు.

మొయినాబాద్‌: ఇటీవల కురిసిన వర్షాలకు పూర్తిస్థాయిలో నిండిన సురంగల్‌ పెద్ద చెరువుకు చిన్నపాటి గండిపడటంతో అధికారులు సకాలంలో స్పందించారు. గండి పూడ్చి మరమ్మతులు చేయించడంతో ప్రమాదం తప్పింది. మున్సిపల్‌ పరిధిలోని సురంగల్‌ పెద్ద చెరువులోకి కొన్ని రోజులుగా వరద రావడంతో పూర్తిస్థాయిలో నిండింది. చెరువు కట్టకు చిన్నపాటి గండి పడి నీళ్లు కిందికి వెళ్తున్నాయి. గండి పెద్దది కాకముందే ఇరిగేషన్‌, రెవెన్యూ అధికారులు స్పందించారు. ఇరిగేషన్‌ ఏఈ ప్రియాంక, ఆర్‌ఐ రాజేష్‌, వర్క్‌ఇన్‌స్పెక్టర్‌ నర్సింహ తదితరులు శనివారం చెరువు వద్దకు చేరుకుని కట్టను పరిశీలించారు. మట్టి పోసి కట్టకు పడిన గండిని పూడ్చి మరమ్మతులు చేయించారు.

ఆమనగల్లు: మాజీమంత్రి, బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ను కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్‌ మర్యాదపూర్వకంగా కలిసారు. హైదరాబాద్‌లోని కేటీఆర్‌ నివాసంలో శనివారం ఆయనను కలిసి పార్టీ గురించి చర్చించారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ మాజీ సభ్యురాలు విజితారెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు పొనుగోటి అర్జున్‌రావ్‌ ఉన్నారు.

ఆర్టీసీ వినూత్న ప్రయోగం

ఇబ్రహీంపట్నం: ఆర్టీసీ వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టిందని ఇబ్రహీంపట్నం డిపో మేనేజర్‌ వెంకటనర్సప్ప తెలిపారు. దాతల ద్వారా సేకరించిన విరాళాలతో అనాథలు, వృద్ధులు, దివ్యాంగులు, నిరుపేద విద్యార్థులకు పుణ్యక్షేత్రాలు, పర్యాటక ప్రాంతాలకు ఉచిత యాత్ర ప్రవేశపెడుతోందని చెప్పారు. దాతలు, కార్పొరేట్‌ సంస్థలు, ప్రజాప్రతినిధులు విరాళాలు అందించి భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేశారు.

డిగ్రీ కోర్సుల్లో చేరికకు దరఖాస్తుల ఆహ్వానం 
1
1/1

డిగ్రీ కోర్సుల్లో చేరికకు దరఖాస్తుల ఆహ్వానం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement