
విద్యాభివృద్ధికి పెద్దపీట
షాద్‌నగర్‌రూరల్: సాంకేతిక విద్యలో ప్రపంచంతో పోటీ పడే విధంగా గిరిజన గురుకులాల విద్యార్థులను తయారు చేస్తామని గిరిజన, మైనార్టీ సంక్షేమశాఖ మంత్రి అడ్లూరిలక్ష్మణ్‌కుమార్ అన్నారు. పట్టణంలో రెండు రోజులుగా రాష్ట్ర ఉన్నత విద్యామండలి, గిరిజన గురుకుల మహిళా డిగ్రీ, పీజీ కళాశాల సంయుక్త ఆధ్వర్యంలో కృత్రిమ మేధ (ఆర్టి ఫిషియల్ ఇంటెలిజెన్స్)పై జాతీయ సదస్సు కొనసాగుతోంది. పట్టణ సమీపంలోని కుంట్లరాంరెడ్డి గార్డెన్‌లో శనివారం నిర్వహించిన సదస్సు ముగింపు సమావేశానికి మంత్రి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాష్ట్రంలో సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలో విద్యావ్యవస్థను పటిష్టం చేసేందుకు చర్యలు చేపట్టినట్టు తెలిపారు. భవిష్యత్ తరాల విద్యార్థుల అభివృద్ధికి ఏఐ ఎంతగానో దోహదపడుతుందని అన్నారు. స్థానిక ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ కోరిక మేరకు కొత్తూరు మండలంలోని దర్గా అభివృద్ధికి రూ.8 కోట్లు మంజూరు చేసేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ మాట్లాడుతూ.. విద్యార్థులు సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా విద్యను అభ్యసించాలని అన్నారు. అనంతరం వెబ్‌సైట్‌లో గురుకుల కళాశాలల సమాచారంతో కూడిన ఏఐ చాట్‌బాక్స్‌ను ఆవిష్కరించారు. ఏఐలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రశంసాపత్రాలు అందజేశారు. కార్యక్రమంలో సాంఘీక సంక్షేమశాఖ గురుకులాల కార్యదర్శి సీతాలక్ష్మి, డిప్యూటీ కార్యదర్శులు లింగారెడ్డి, వేణుగోపాల్‌రావు, పాలమూరు యూనివర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ రమేష్‌బాబు, ఐఐటీ డైరెక్టర్ శ్రీనివాస్‌రెడ్డి, కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్‌నీతాపోలె తదితరులు పాల్గొన్నారు.
మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్