డ్రైవరే సూత్రధారి | - | Sakshi
Sakshi News home page

డ్రైవరే సూత్రధారి

Sep 14 2025 9:08 AM | Updated on Sep 14 2025 9:08 AM

డ్రైవ

డ్రైవరే సూత్రధారి

ఆదివారం శ్రీ 14 శ్రీ సెప్టెంబర్‌ శ్రీ 2025

న్యూస్‌రీల్‌

ఆదివారం శ్రీ 14 శ్రీ సెప్టెంబర్‌ శ్రీ 2025

వీడిన శంకర్‌పల్లి రాబరీ కేసు

పథకం ప్రకారమే రూ. 40 లక్షలు కొట్టేసిన నిందితులు

24 గంటల్లో ఛేదించిన

సైబరాబాద్‌ పోలీసులు

సాక్షి, సిటీబ్యూరో: శంకర్‌పల్లి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో జరిగిన రూ. 40 లక్షల దారి దోపిడీ కేసును సైబరాబాద్‌ పోలీసులు 24 గంటల్లో ఛేదించారు. కారు పార్కింగ్‌ లైట్లు వెలగడమే దోపిడీకి సిగ్నల్‌గా పెట్టుకొని రాబరీకి పాల్పడినట్లు విచారణలో పోలీసులు గుర్తించారు. ప్రధాన సూత్రధారి కారు డ్రైవర్‌ మధుతో పాటు మరో ఆరుగురిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఆయా వివరాలను సైబరాబాద్‌ కమిషనర్‌ అవినాష్‌ మహంతి శనివారం మీడియాకు వెల్లడించారు.

● హైదరాబాద్‌కు చెందిన రాకేష్‌ అగర్వాల్‌కు సాయిబాబా అనే వ్యక్తి మేనేజర్‌గా వ్యవహరిస్తున్నాడు. వ్యాపార అవసరాల నిమిత్తం సాయిబాబా ఎక్కడికి వెళ్లాలన్నా బీఎన్‌ రెడ్డి నగర్‌కు చెందిన కార్‌ యజమాని, డ్రైవర్‌ మధు కాసులను సంప్రదించేవాడు. ఈ క్రమంలో సాయిబాబా కదలికలను మధు గమనిస్తూ ఉండేవాడు. ఈనెల 12న రాకేష్‌ అగర్వాల్‌ వికారాబాద్‌లోని అన్సారీ అనే కస్టమర్‌ నుంచి రూ. 40 లక్షలు వసూలు చేసి తీసుకురమ్మని సాయిబాబాను ఆదేశించాడు. దీంతో సాయిబాబా మధుకు ఫోన్‌ చేసి వికారాబాద్‌కు తన క్యాబ్‌ బుక్‌ చేసుకున్నాడు. అప్పుడే సాయిబాబా భారీ డబ్బును తీసుకొస్తాడని మధు ఊహించాడు.

దారి దోపిడీకి స్కెచ్‌

పథకం ప్రకారం మధు తన స్నేహితులైన ఆర్సీపురానికి చెందిన విజయ్‌కుమార్‌, కాచిగూడకు చెందిన మహ్మద్‌ అజర్‌లకు ఈ విషయాన్ని తెలిపాడు. ఇరువురిపై గతంలో ఫోర్జరీ, డ్రగ్స్‌, దొంగతనాల కేసులు కూడా ఉన్నాయి. దోపిడీ చేసేందుకు విజయ్‌ పాత నేరస్తుడైన గచ్చిబౌలికి చెందిన హర్షవర్ధన్‌ను నియమించుకు న్నాడు. నలుగురు కలిసి వికారాబాద్‌ నుంచి హైదరాబాద్‌కు మార్గంలో రెక్కీ నిర్వహించారు. రద్దీ తక్కువగా ఉండే ప్రాంతం, దోపిడీ తర్వాత సులువుగా తప్పించుకునే వీలున్న హుస్సేన్‌పూర్‌ గేట్‌ వద్ద దోపిడీ చేయాలని నిర్ణయించుకున్నారు.

ఎస్కార్ట్‌ వాహనంలో..

ఈ నెల 12న ఉదయం 11:30 గంటలకు సాయిబాబా, డ్రైవర్‌ మధుతో పాటు కారులో వికారాబాద్‌ చేరుకున్నాడు. అన్సారీ నుంచి రూ. 40 లక్షలు తీసుకొని, కారులో హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణమయ్యారు. హర్ష తన స్నేహితులైన మహబూబ్‌నగర్‌కు చెందిన అనుదీప్‌ అలియాస్‌ లడ్డు స్విఫ్ట్‌ డిజైర్‌ కార్‌ను తీసుకొని హఫీజ్‌పేటకు చెందిన దీపక్‌, హుస్సేనీఆలంకు చెందిన షమీముల్లాలతో కలిసి కారులో మధు కారును వెంబడిస్తున్నారు. వీరి వెనుక ఎస్కార్ట్‌ వాహనంలో విజయ్‌, అజార్‌లు అనుసరిస్తున్నారు. డ్రైవర్‌ మధు నిరంతరం విజయ్‌తో ఫోన్‌లో తన లొకేషన్‌ వివరాలను అందిస్తూ ఉన్నాడు. దీన్ని విజయ్‌ హర్ష్‌కు పంపిస్తూ ఉన్నాడు.

డ్రైవరే సూత్రధారి1
1/1

డ్రైవరే సూత్రధారి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement