ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తే సహించేది లేదు
ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తే సహించేది లేదు కడ్తాల్: గిరిజన లంబాడీల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే ప్రయత్నం ఎవరు చేసినా సహించేదిలేదని సేవాలాల్ సేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జర్పుల లక్పతినాయక్ హెచ్చరించారు. మండల కేంద్రంలో ఆదివారం సేవాలాల్ సేన నాయకులతో కలిసి మాట్లాడారు. గిరిజన లంబాడీలను కించపరుస్తూ మాట్లాడే వారిని ఆయా పార్టీల నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం గిరిజనులకు 12 శాతం రిజర్వేషన్ కల్పించాలని, ఎస్టీ పంచాయతీలను రెవెన్యూ పంచాయతీలుగా గుర్తించాలని కోరారు. కార్యక్రమంలో సేన జిల్లా అధ్యక్షుడు నరేశ్‌నాయక్, ఎల్‌హెచ్‌పీఎస్ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జైపాల్‌నాయక్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు బీచ్యానాయక్, సేవాలాల్ సేన జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ పత్యనాయక్ తదితరులు పాల్గొన్నారు. మైసిగండి మైసమ్మ
సన్నిధిలో సినీ నటుడు ‘పట్నం’ చిన్న చెరువులో వ్యర్థాల డంప్ హమాలీల సమస్యలు పరిష్కరించాలి
కడ్తాల్: హమాలీ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని ఆల్ హమాలీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వంగూరు రాములు అన్నారు. మండల కేంద్రంలో ఆదివారం హ మాలీ యూనియన్ జిల్లా ఉపాధ్యక్షుడు మల్లెపాక వీరయ్య అధ్యక్షతన జిల్లా హమాలీ కార్మిక యూనియన్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాములు మాట్లాడుతూ.. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన పదేళ్లలో కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తోందని విమర్శించారు. పోరాడి సాధించుకున్న 29 చట్టాలు యథావిధిగా కొనసాగించాలని, పనిభారం తగ్గించాలని, సంక్షేమ పథకాలు అమలు చేయాలని, నాలుగు లేబర్ కోడ్‌లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి చంద్రమోహన్ మాట్లా డుతూ.. బీజేపీ అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను మార్చుకోకపోతే పోరాటం తప్ప దని హెచ్చరించారు. అనంతరం జిల్లా హమా లీ యూనియన్ నూతన కమిటీని ఎన్నుకున్నా రు. గౌరవ అధ్యక్షుడిగా పగడాల యాదయ్య, అధ్యక్షుడిగా శేఖర్, ప్రధాన కార్యదర్శిగా చంద్రమోహన్, కోశాధికారిగా పెంటయ్య, ఉపాధ్యక్షులుగా వీరయ్య, గోపాల్, రమేశ్, దుర్గయ్య, సహాయ కార్యదర్శులుగా మొగులయ్య, కృష్ణయ్య, సత్యనారాయణ, నర్సింహ, దయానంద్, వెంకటయ్య ఎన్నికయ్యారు.
కడ్తాల్: మండల పరిధిలోని మైసిగండి మైసమ్మ ఆలయాన్ని ఆదివారం సినీనటుడు శ్రవణ్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ నిర్వాహకులు ఆయనను శాలువాతో సన్మానించి, అమ్మవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. కార్యక్రమంలో ఆలయ ఈఓ స్నేహలత, నిర్వాహకులు పాల్గొన్నారు.
ఇబ్రహీంపట్నం రూరల్: గుర్తు తెలియని వ్యక్తులు హైదరాబాద్ చార్మినార్ నుంచి వ్యర్థాలను తీసుకొచ్చి రాత్రికి రాత్రే ఇబ్రహీంపట్నం చిన్న చెరువులో డంప్ చేశారు. శనివారం అర్ధరాత్రి నగరం నుంచి జీహెచ్‌ఎంసీ– 4కి చెందిన రెండు వాహనాల్లో తెచ్చిన చెత్తను చెరువులో పోస్తుండగా స్థానికులు గమనించారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు అక్కడికి వెళ్లి పరిశీలించారు. రెండు వాహనా లను అదుపులోకి తీసుకొని, నలుగురు వ్యక్తులపై ఎన్విరాన్‌మెంట్ కేసులు నమోదు చేశారు. ఇదిలా ఉండగా.. చెరువులో వ్యర్థాలను పారబోసిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని పలువురు నాయకులు డిమాండ్ చేశారు. చెరువును కలుషితం చేయడానికి యత్నించిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని కోరుతూ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
1/2
ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తే సహించేది లేదు
2/2
ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తే సహించేది లేదు