
రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి
అబ్దుల్లాపూర్‌మెట్: మండల పరిధిలోని అబ్దుల్లాపూర్‌మెట్, కవాడిపల్లి, చిన్నరావిరాల, ఇనాంగూడ, మజీద్‌పూర్ గ్రామాల్లో రూ.88.50 లక్షల వ్యయంతో చేపడుతున్న పలు అభివృద్ధి పనులకు శనివారం ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గంలోని ప్రతి గ్రామాన్ని రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి చేయడంతో పాటు ప్రజలకు కావాల్సిన మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తానన్నారు. ప్రతి పేదవాడి ముఖంలో ఆనందాన్ని చూడాలన్నదే ప్రజా ప్రభుత్వం లక్ష్యమన్నారు. పేదలను దృష్టిలో పెట్టుకునే వారికి అన్ని విధాలుగా లబ్ధి చేకూర్చేందుకు సంక్షేమ పథఽకాలను ప్రవేశ పెడుతున్నామన్నారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచే అభ్యర్థులనే గెలిపించుకోవాలని కోరారు. కార్యక్రమంలో పలువురు మండల, గ్రామ పంచాయతీ మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి