
రైల్వే సమస్యలు పరిష్కరించండి
చేవెళ్ల/శంకర్‌పల్లి: చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని రైల్వే అండర్, రైల్వే ఓవర్ బ్రిడ్జిల నిర్మాణాల ప్రగతిపై చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి రైల్వే అధికారులతో మంగళవారం చర్చించారు. నగరంలోని రైల్వే కార్యాలయంలో దక్షిణ మధ్య రైల్వే జీఎం సంజ్‌య్‌కుమార్ శ్రీవాత్సవ, డీజీఎంలు ఉదయనాథ్, మల్లాది శ్రీనివాస్, సీపీఆర్‌ఓ శ్రీధర్‌తో సమావేశమయ్యారు. శంకర్‌పల్లి రైల్వే స్టేషన్‌ను అధునికీకరించాలని విజ్ఞప్తి చేశారు. కరోనాకి ముందుకు శంకర్‌పల్లిలో పలు ఎక్స్‌ప్రెస్ (ముంబై, హుబ్లీ, బీజాపూర్), డెమో ప్యాసింజర్ రైళ్లు ఆగేవని, ప్రస్తుతం వాటిని పునరుద్ధరించాలని కోరారు. పంట పొలాలకు వెళ్లేందుకు రైతుల కోసం శంకర్‌పల్లి మున్సిపల్ పరిధిలోని ఫత్తేపూర్, మండల పరిధిలోని కొండకల్ వద్ద రైల్వే లెవల్ క్రాసింగ్ వద్ద రోడ్డు అండర్ బ్రిడ్జి నిర్మించాలని కోరగా వారు సానుకూలంగా స్పందించారు. సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.