
జనహితయాత్రకు ఘన స్వాగతం
చేవెళ్ల/మొయినాబాద్: వికారాబాద్ జిల్లా పరిగి నుంచి ప్రారంభించే జనహిత పాదయాత్రకు వెళ్తున్న కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్, జిల్లా ఇన్‌చార్జి మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబుకు పార్టీ శ్రేణులు మొయినాబాద్‌లో ఘన స్వాగతం పలికాయి. హిమాయత్‌నగర్ చౌరస్తాకు చేరుకోగానే పెద్ద ఎత్తున టపాసులు పేల్చారు. అక్కడే ఉన్న అంబేడ్కర్, బాబు జగ్జీవన్‌రామ్, మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ విగ్రహాలకు మీనాక్షి నటరాజన్, మహేశ్‌కుమార్‌గౌడ్, శ్రీధర్‌బాబు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా స్థానిక నాయకులు వారికి భారీ గజమాలతో స్వాగతం పలికారు. కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు చల్లా నర్సింహారెడ్డి, చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మధుసూదన్‌రెడ్డి, టీపీసీసీ సభ్యు డు షాబాద్ దర్శన్, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు శ్రీకాంత్, మాజీ సర్పంచ్‌లు, ఎంపీటీసీ మాజీ సభ్యులు, ఇతర నాయకులు పాల్గొన్నారు.
చిలుకూరులో పూజలు
చిలుకూరు బాలాజీ దేవాలయంలో మీనాక్షి నటరాజన్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. గురువారం సాయంత్రం 4 గంటల సమయంలో టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్, మంత్రి శ్రీధర్‌బాబు, మాజీ ఎంపీలు హన్మంతరావు, రాజయ్య తదితరులతో కలిసి ఆమె ఆలయానికి చేరుకున్నారు. స్వామివారిని దర్శించు కున్న అనంతరం ఆలయ ప్రాంగణంలోని శివాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ మేనేజింగ్ కమిటీ కన్వీనర్ గోపాలకృష్ణస్వామి, అర్చకుడు సురేష్‌స్వామి ఆమెకు స్వామివారి పూలమాలలు అందజేసి ఆశీర్వదించారు.
చేవెళ్లలో పామెన బీంభరత్ ఆధ్వర్యంలో..
కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్‌కు చేవెళ్లలో పామెన భీంభరత్ ఆధ్వర్యంలో గజమాలతో ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా షాబాద్ చౌరస్తాలోని ఇందిరాగాంధీ, వైఎస్ రాజశేఖర్‌రెడ్డి విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళి అర్పించారు. కార్యక్రమంలో రాష్ట్ర పొల్యూషన్ కంట్రోల్‌బోర్డు సభ్యుడు చింపుల సత్యనారాయణరెడ్డి, జిల్లా నాయకుడు గౌరీ సతీష్, మహిళా నాయకురాలు జ్యోతిభీంభరత్, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ జూకన్నగారి శ్రీకాంత్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
వర్గపోరు మరోసారి బట్టబయలు
పార్టీలో వర్గపోరు కొనసాగుతుందని మరోసారి బట్టబయలైంది. ఎమ్మెల్యే కాలె యాదయ్య, నియోజకవర్గం ఇన్‌చార్జి పామెన భీంభరత్ మద్య సయోధ్య లేకపోవటంతో ఇరు వర్గీయులు వేర్వేరుగా స్వాగత కార్యక్రమాలు నిర్వహించారు.
మొయినాబాద్‌లో
ఆహ్వానం పలికిన పార్టీ శ్రేణులు
చిలుకూరు బాలాజీ దేవాలయంలో పూజలు చేసి పాదయాత్రకు
బయలుదేరిన నేతలు

జనహితయాత్రకు ఘన స్వాగతం