
ఆర్థిక ఇబ్బందులతో వ్యక్తి బలవన్మరణం
శంకర్‌పల్లి: ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఓ యువకుడు ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. సీఐ శ్రీనివాస్ గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని పర్వేద గ్రామానికి చెందిన చాకలి బుచ్చయ్యకి కుమారుడు వెంకటేశ్ (24) ఉన్నాడు. గ్రామ శివారులోని ఓ ప్రైవేటు సంస్థలో పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఇటీవల కుటుంబంలో అప్పులు అధికమయ్యాయి. తండ్రీకొడుకుల మధ్య తరచూ వాగ్వాదాలు మొదలయ్యా యి. ఈ క్రమంలో ఆదివారం అవి తారాస్థాయికి చేరడంతో మనస్తాపానికి గురైన వెంకటేశ్.. అర్ధరాత్రి ఇంట్లో ఫ్యాన్‌కి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
ట్రాఫిక్ ఉల్లంఘనులపై కేసులు
శంషాబాద్: ఆర్‌జీఐఏ ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఇటీవల నమోదైన 33 కేసుల్లో ఒకరి జైలు శిక్షతో పాటు మిగతా వారిని నుంచి జరిమానా వసూలు చేసినట్లు ఇన్‌స్పెక్టర్ ప్రమోద్‌కుమార్ తెలిపారు. మద్యం సేవించి వాహనాలు నడిపిన వారిలో ఓ వ్యక్తికి మూడు రోజుల జైలు శిక్ష, రూ. 2 వేల జరిమానాను కోర్టు విధించిందన్నారు. మద్యం సేవింంచి వాహనాలు నడిపిన 17 మంది నుంచి రూ. 50 వేలు జరిమానా, లైసెన్స్ లేకుండా వాహనాలు నడిపిన వారి నుంచి రూ. 32 వేల జరిమానా వసూలు చేశారమన్నారు. వాహనదారులు తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలన్నారు. ఉల్లంఘనులపై చట్టపరమైన చర్యలుంటాయని ఆయన హెచ్చరించారు.