చెరువులో మునిగిన యువతి!
ఇబ్రహీంపట్నం: చెరువులోకి దిగిన యువతి ప్రమాదవశాత్తు నీటిలో మునిగిపోయిన సంఘటన ఇబ్రహీంపట్నం పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆదివారం సాయంత్రం చోటుచేసుకుంది. నగరంలోని ఫలక్‌నుమాకు చెందిన రేష్మా(24) బాలపూర్‌కు చెందిన ఆమె స్నేహితుడు ఖాసీంతో కలిసి ఇబ్రహీంపట్నం చెరువు వద్దకు ఆటోలో వచ్చినట్లు తెలిసింది. ఖాసీం ఈత కొడుతుండగా రేష్మా కూడా చెరువులోకి దిగినట్లు సమాచారం. ఏమైయిందో ఏమోగాని ఆకస్మాత్తుగా యువతి చెరువు నీటిలో మునిగిపోయింది. చీకటి పడటంతో ఆమె ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టలేదు. ఈ సంఘటన సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
బైక్‌ను ఢీకొన్న ట్రాక్టర్
ఒకరి దుర్మరణం
ఆమనగల్లు: రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన ఆమనగల్లు పట్టణ సమీపంలో చోటు చేసుకుంది. ముర్తుజపల్లి గేటు వద్ద హైదరాబాద్–శ్రీశైలం జాతీయ రహదారిపై బైక్‌ను ట్రాక్టర్ ఢీ కొట్టింది. ఎస్‌ఐ వెంకటేశ్ తెలిపిన వివరాల ప్రకారం.. నాగర్‌కర్నూల్ జిల్లా పెద్ద కొత్తపల్లి గ్రామానికి చెందిన రాయకుంట కృష్ణయ్య(35), ఆయన బంధువు శేఖర్ పని నిమిత్తం హైదరాబాద్‌లో స్థిరపడ్డారు. వీరు ఆదివారం ఉదయం ద్విచక్రవాహనంపై సొంతూరికి బయలుదేరారు. మార్గమధ్యలో పట్టణ సమీపంలోని ముర్తుజపల్లి గేటు వద్ద అతివేగంగా వచ్చిన ఓ ట్రాక్టర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కృష్ణయ్య అక్కడికక్కడే మృతిచెందగా, శేఖర్ తీవ్రంగా గాయపడటంతో చికిత్స నిమిత్తం హైదరాబాద్‌కు తరలించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
చెరువులో మునిగిన యువతి!


