
ఓటు హక్కు బాధ్యతే..
కేశంపేట: ఎన్నికల సంఘం ఎన్ని అవగాహన కార్యక్రమాలు చేపట్టినా ఓటర్లు వంద శాతం పోలింగ్‌కు సహకరించడం లేదు. శరీరంలో అన్ని అవయవాలు సక్రమంగా ఉన్న వారే పోలింగ్ కేంద్రాలకు రాక బాధ్యతను మరుస్తున్నారు. కానీ మండల పరిధిలోని అల్వాల గ్రామానికి చెందిన కృష్ణయ్య అంగ వైకల్యాన్ని లెక్క చేయకుండా తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఆయన కొద్దిరోజులు క్రితం విద్యుత్ ప్రమాదంలో రెండు చేతులను పోగొట్టుకున్నారు. సార్వత్రిక సమరంలో భాగంగా కృష్ణయ్య సోమవారం సహాయకురాలుగా భార్య జయమ్మను కేంద్రానికి తీసుకువెళ్లి ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటు వేసిన వ్యక్తికి రెండు చేతులు లేకపోవడంతో అధికారులు ఆయన కాలికి ఇంకును వేశారు.