సిరిసిల్లటౌన్: ఉద్యమకారుల పోరాట ఫలితంగానే జిల్లా ఆవిర్భవించిందని వక్తలు కొనియాడారు. జిల్లా ఉద్యమకారుల సంఘం ఆధ్వర్యంలో ఆదివారం గాంధీచౌక్‌లో దశాబ్ది వేడుకలు నిర్వహించారు. కేస్ కోసి స్వీట్లు పంచిపెట్టారు. జిల్లా కోసం పదేళ్ల క్రితం ఉద్యమకారులు కుటుంబాలకు దూరమైన విషయాన్ని గుర్తు చేశారు. జిల్లా ఉద్యమకారులపై అప్పటి సర్కారు కేసులు నమోదు చేయడం శోచనీయమన్నారు. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్, ఉద్యమకారుల సంఘం ప్రతినిధులు చొక్కాల రాము, కత్తెర దేవదాసు, ఆకునూరి బాలరాజు, రాగుల రాములు, సూర దేవరాజు, కంసాల మల్లేశం, బొప్ప దేవయ్య, గడ్డం నర్సయ్య, బుస్సా వేణు, కాముని వనిత, సోమిశెట్టి దశరథం, జాలుగం ప్రవీణ్, బైరినేని రాము, లింగంపల్లి మధుకర్ తదితరులు పాల్గొన్నారు.


