జేఎన్టీయూ సమస్యలు పరిష్కరించండి | - | Sakshi
Sakshi News home page

జేఎన్టీయూ సమస్యలు పరిష్కరించండి

Oct 11 2026 11:49 PM | Updated on Oct 11 2026 11:49 PM

● సీఎం రేవంత్‌రెడ్డికి బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ విజ్ఞప్తి

● సీఎం రేవంత్‌రెడ్డికి బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ విజ్ఞప్తి

సిరిసిల్ల: జిల్లాలోని జేఎన్టీయూ ఇంజినీరింగ్‌ కళాశాల విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, సిరిసిల్ల ఎమ్మెల్యే కె.తారకరామారావు సీఎం రేవంత్‌రెడ్డికి ఆదివారం ఓ ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. 2021లో రూ.402కోట్ల పరిపాలన అనుమతులతో మంజూరైన కాలేజీ శాశ్వత క్యాంపస్‌ నిర్మాణం పెండింగ్‌లో ఉందని పేర్కొన్నారు. తంగళ్లపల్లి మండలం మండెపల్లి వద్ద 20 ఎకరాలు కేటాయించినా పనులు మొదలుకాకపోవడంతో తాత్కాలికంగా అగ్రహారంలోని డిగ్రీ కాలేజీ ప్రాంగణంలో కొనసాగుతోందని తెలిపారు. ఈ ప్రాంగణం నుంచి మరో ప్రైవేటు భవనానికి తరలించే ప్రతిపాదనలు ప్రభుత్వం మానుకోవాలని కోరారు. మండెపల్లిలో కేటాయించిన స్థలంలో శాశ్వత క్యాంపస్‌ నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని, కొత్త క్యాంపస్‌ పూర్తయ్యే వరకు ప్రస్తుత ప్రాంగణంలోనే కొనసాగించేందుకు అనుమతించాలని కోరారు. విద్యార్థుల భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని సమస్యలు పరిష్కరించేందుకు ముఖ్యమంత్రి తక్షణమే జోక్యం చేసుకోవాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement