శైలపుత్రీ నమోస్తుతి | - | Sakshi
Sakshi News home page

శైలపుత్రీ నమోస్తుతి

Oct 11 2026 11:49 PM | Updated on Oct 11 2026 11:49 PM

● ఎస్పీ మహేశ్‌ బీ గీతే

వేములవాడఅర్బన్‌: దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా భీమేశ్వరస్వామి ఆలయంలో అమ్మవారు మొదటి రోజు శైలపుత్రి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం 7 గంటల నుంచి ఉత్సవాలు ప్రారంభించారు. మహా అభిషేకాలు నిర్వహించారు. భక్తుల కోసం ప్రత్యేక కుంకుమపూజల సేవను అందుబాటులోకి తెచ్చినట్లు ఆలయ అధికారులు తెలిపారు.

శ్రీవారికి అరుదైన సాలగ్రామ హారం

సిరిసిల్లటౌన్‌: శ్రీశాల క్షేత్రంలో కొలువుదీరిన శ్రీలక్ష్మీవేంకటేశ్వరస్వామికి భక్తులు అరుదైన సాలగ్రామహారాన్ని అందజేశారు. అత్యంత విశిష్టమైన అరుదైన ‘అష్టోత్తర శత (108) సుదర్శన సాలగ్రామ హారం’ కోసం అవసరమైన సాలగ్రామ, వెండి కానుకలు అందజేశారు. ఈ హారాన్ని హైదరాబాద్‌లో తయారు చేస్తున్నారు. బుధవారం అలంకార కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆలయ ఈవో డీవీ మారుతిరావు, ప్రధానార్చకులు కృష్ణమాచారి, నవీనాచార్యులు పేర్కొన్నారు.

ప్రజల సహకారంతోనే నేరాల నివారణ

సిరిసిల్ల: బతుకమ్మ, దసరా పండుగల సందర్భంగా స్వగ్రామాలకు వెళ్లే వారు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ మహేశ్‌ బీ గీతే కోరారు. ఆదివారం విలేకరులతో మాట్లాడారు. చోరీల నియంత్రణకు పోలీసుశాఖ తరఫున చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. రాత్రి గస్తీ ముమ్మరం చేశామన్నారు. అనుమానితులు సంచరించినా, అనుమానాస్పద కార్యకలాపాలు కనిపించినా సమీప పోలీస్‌స్టేషన్‌కు లేదా డయల్‌ 112కు సమాచారం ఇవ్వాలని కోరారు. ఊళ్లకు వెళ్లే వారు బంగారు, వెండి, డబ్బు వంటి విలువైన వస్తువులను బ్యాంక్‌ లాకర్లలో దాచుకోవాలని సూచించారు. ఊరెళ్తే ఇంటి పక్క వారికి, పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. రాత్రి సమయంలో ఏదైనా ఒక రూమ్‌లో లైట్‌ వెలుగుతూనే ఉండేలా ఆన్‌ చేసి ఉంచాలన్నారు. ఇంటికి సీసీ కెమెరాలు అమర్చుకోవాలని సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement