జిల్లాల ఆవిర్భావం చారిత్రాత్మకం | - | Sakshi
Sakshi News home page

జిల్లాల ఆవిర్భావం చారిత్రాత్మకం

Oct 11 2026 11:49 PM | Updated on Oct 11 2026 11:49 PM

రద్దు చేసే ధైర్యం ఎవరూ చేయరు

ప్రణాళిక సంఘం మాజీ ఉపాధ్యక్షుడు, మాజీ ఎంపీ వినోద్‌కుమార్‌

సిరిసిల్ల: రాష్ట్రంలో కొత్త జిల్లాల ఆవిర్భావం చారిత్రాత్మకమని, ఉద్యమనేత కేసీఆర్‌ దూరదృష్టితోనే 33 జిల్లాలు ఏర్పాటు చేశారని ప్రణాళిక సంఘం రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షుడు, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్‌ అన్నారు. జిల్లా కేంద్రంలో ఆదివారం జిల్లా ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలను బీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో నిర్వహించారు. సభలో వినోద్‌కుమార్‌ మాట్లాడుతూ పరిపాలన సౌలభ్యం కోసం కేసీఆర్‌ జిల్లాలను ఏర్పాటు చేశారన్నారు. కొత్త జిల్లాలను రద్దు చేసే ధైర్యం ఎవరూ చేయరని, ఆ ప్రయత్నం చేస్తే ప్రజలు తిరగబడతారన్నారు. జిల్లా ఆవిర్భావంతో పాలనపరమైన సంస్కరణలు, మెడికల్‌ కాలేజీ వంటి వసతులు దరిచేరాయని వివరించారు. మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌ మాట్లాడుతూ తెలంగాణ దేశానికి, రాజన్నసిరిసిల్ల రాష్ట్రానికి ఆదర్శంగా నిలిచాయన్నారు. వేములవాడ నియోజకవర్గ ఇన్‌చార్జి చలిమెడ లక్ష్మీనర్సింహారావు, జెడ్పీ మాజీ చైర్‌పర్సన్లు తుల ఉమ, న్యాలకొండ అరుణ, ‘సెస్‌’ చైర్మన్‌ చిక్కాల రామారావు, సిరిసిల్ల మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ జిందం కళాచక్రపాణి, బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య మాట్లాడి జిల్లా సాధన ఉద్యమకారులను సన్మానించారు. మున్సిపల్‌ వైస్‌చైర్మన్‌ దార్ల సందీప్‌, ‘సెస్‌’ వైస్‌చైర్మన్‌ దేవరకొండ తిరుపతి, బీఆర్‌ఎస్‌ నాయకులు గూడూరి ప్రవీణ్‌, ఏనుగు మనోహర్‌రెడ్డి, బొల్లి రామ్మోహన్‌, ఆకునూరి శంకరయ్య, సత్తార్‌, సిద్ధం వేణు, కత్తెరపాక కొండయ్య, గజభీంకార్‌ రాజన్న, గడ్డం నాగరాజు, ‘సెస్‌’ డైరెక్టర్లు దార్నం లక్ష్మీనారాయణ, దిడ్డి రమాదేవి, మున్సిపల్‌ కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.

కొత్తబస్టాండు నుంచి తెలంగాణ భవన్‌ వరకు..

కొత్తబస్టాండు ప్రాంతంలో తెలంగాణతల్లి విగ్రహానికి పూలమాల వేసి, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌, బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు. అంబేడ్కర్‌, నేతన్న విగ్రహాలకు పూలమాలలు వేసి, పాతబస్టాండులోని తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద నివాళి అర్పించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement