సిరిసిల్ల/సిరిసిల్ల అర్బన్: యువత క్రీడల్లో రాణించాలని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కోరారు. సిరిసిల్ల పట్టణ పరిధిలోని రంగినేని మోహన్‌రావు చారిటబుల్ ట్రస్టు వద్ద జిల్లా స్కూల్‌గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో అండర్–17 బాలికల రాష్ట్రస్థాయి క్రికెట్ పోటీలను ఆదివారం ప్రారంభించారు. విప్ శ్రీని వాస్ మాట్లాడుతూ సీఎం రేవంత్‌రెడ్డి క్రీడలకు పెద్దపీట వేస్తున్నారన్నారు. తెలంగాణ నుంచి భవిష్యత్‌లో ఒలింపిక్స్‌లో బంగారు పతకాలు సాధించే క్రీడాకారులు తయారు కావాలన్న లక్ష్యంతో హైదరాబాద్‌లో స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటుకు చర్యలు చేపట్టినట్ల తెలిపారు.
జిల్లా ఆవిర్భావం ఉద్యమకారుల విజయం
ప్రజల ఉద్యమ ఫలితంగానే జిల్లా ఆవిర్భావం సాధ్యమైందని, ఇది ఉద్యమకారుల విజయమని విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. సిరిసిల్లలో విలేకరులతో మాట్లాడారు. జిల్లా దశాబ్ధి ఉ త్సవాలను బీఆర్‌ఎస్ నిర్వహించడం హాస్యాస్పదమన్నారు. 2016లో ఆనాటి మంత్రి, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ జిల్లా సాధ్యం కాదని బహిరంగలేఖ రాశారని గుర్తు చేశారు. ఉద్యమం ఉవ్వెత్తున ఎగసిపడడంతో విధిలేక జిల్లాను ప్రకటించి, ఇప్పుడేమో సంబరాలు చేస్తున్నారని విమర్శించారు. సీఎం సభ సక్సెస్‌తో ఉనికి కోల్పోతున్నామనే భయంతో దశాబ్ది ఉత్సవాలు నిర్వహిస్తున్నారని ఎద్దేవా చేశారు. ఆయా కార్యక్రమాల్లో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నాగుల సత్యనారాయణగౌడ్, డీఎస్పీ నాగేంద్రచారి, రంగినేని మోహన్‌రావు, పార్టీ సిరిసిల్ల పట్టణ అధ్యక్షుడు సూర దేవరాజు, ఆడెపు చంద్రకళ, నాయకులు ఆకునూరి బాలరాజు, చొప్పదండి ప్రకాశ్, బొప్ప దేవయ్య, శ్రీనివాస్, రాగుల రాములు, చొక్కాల రాము పాల్గొన్నారు.


