కుంటలు తవ్వినం | - | Sakshi
Sakshi News home page

కుంటలు తవ్వినం

Oct 11 2026 11:49 PM | Updated on Oct 11 2026 11:49 PM

ఇటీవల చేనుల్లో వాన నీళ్లు ఇంకేందుకు కుంటలు తవ్వాము. ఈ కుంటలతో వర్షం నీరు ఇంకుతుంది. అటవీ ప్రాంతంలోనూ నీటివాలు ఆధారంగా గుంతలు తవ్వాము. రోజుకు రూ.300 కూలీ వస్తుంది. ఉన్న ఊరిలోనే ఉపాధి పనికి వెళ్తున్నాం.

– బోడ ఎల్లయ్య, ఉపాధి కూలీ, వీర్నపల్లి

అన్ని పనులు చేస్తున్నాం

మా ఊరిలో ఏ పని ఉంటే ఆ పనికి వెళ్తున్నాం. చెరువులో మట్టి తీసినం. మొక్కలు నాటినం. తొవ్వలు పోసినం. చేన్లలో గుంతలు తవ్వినం. కాల్వ పని చేసినం. రోజూ రూ.250 నుంచి రూ.290 దాకా కూలి వస్తుంది. ఉపాధి పని లేని రోజుల్లో వేరే పనులకు వెళ్తాం.

– జాల్గం మల్లయ్య, ఉపాధి కూలీ, కనగర్తి

కూలీలకు పని కల్పించేలా ప్రణాళిక

గ్రామీణకూలీలకు పనులు క ల్పించేలా ప్రణాళిక సిద్ధం చేశాం. సర్పంచులు, కార్యదర్శులకు ఆయా ప్రాంతాల్లో అనువైన పనులు చేయించడంపై శిక్షణ ఇప్పించాం. కూలీలు భారీ సంఖ్యలో వస్తున్నారు. రాష్ట్రంలో జిల్లా ప్రథమస్థానంలో నిలవడం చాలా సంతోషం. ఇదే స్ఫూర్తితో ముందుకు వెళ్తాం. – గరీమా అగ్రవాల్‌, కలెక్టర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement