ఎంప్లాయీస్‌, టీఎంయూ హవా | - | Sakshi
Sakshi News home page

ఎంప్లాయీస్‌, టీఎంయూ హవా

Oct 10 2026 12:04 AM | Updated on Oct 10 2026 12:04 AM

సత్తాచాటిన ఎంప్లాయీస్‌ యూనియన్‌ కూటమి 2,869 ఓట్లకు గానూ 2,802 ఓట్లు పోలింగ్‌

డిపోల వారీగా పోలైన ఓట్లు

సంబరాలు..

కరీంనగర్‌ రీజియన్‌ పరిధిలోని 8 డిపోల్లో ఎంప్లాయీస్‌ యూనియన్‌ విజయభేరి

మూడు డిపోల్లో టీఎంయూ కూటమి విజయం

ఆర్టీసీ ఎన్నికల్లో 97.67శాతం పోలింగ్‌ నమోదు

2,869 మందికి 2,802 మంది ఓటు హక్కు వినియోగం

కరీంనగర్‌టౌన్‌: టీజీఎస్‌ ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికల్లో కరీంనగర్‌ రీజియన్‌లో ఎంప్లాయీస్‌ యూనియన్‌, టీఎంయూ కూటమి ఆధిక్యాన్ని చాటుకుంది. రీజియన్‌ పరిధిలోని 11 డిపోలకు గానూ కరీంనగర్‌–1, హుజూరాబాద్‌, సిరిసిల్ల, వేములవాడ, జగిత్యాల, కోరుట్ల, గోదావరిఖని, మంథనిల్లో టీఎంయూ కూటమి విజయం సాధించింది. కరీంనగర్‌–2, మెట్‌పల్లి, హుస్నాబాద్‌ డిపోల్లో కాంగ్రెస్‌ కూటమి గెలుపొందింది. జోనల్‌ వర్క్‌షాప్‌తో పాటు ఆర్‌ఎం కార్యాలయంలో టీడబ్ల్యూయూ కూటమి పైచేయి సాధించింది.

ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికల్లో రెండు కూటమిల మధ్యనే ప్రధాన పోటీ నెలకొన్న విషయం తెలసిందే. ఎంప్లాయీస్‌ యూనియన్‌(ఈయూ), తెలంగాణ మజ్దూర్‌ యూనియన్‌(టీఎంయూ), నేషనల్‌ మజ్దూర్‌ యూనియన్‌(ఎన్‌ఎంయూ) జేఏసీగా బరి లోకి దిగగా.. తెలంగాణ ఆర్టీసీ వర్కర్స్‌ యూనియ న్‌(టీడబ్ల్యూయూ), స్టాప్‌ అండ్‌ వర్కర్స్‌ ఫెడరేషన్‌, స్టాప్‌ అండ్‌ వర్కర్స్‌ యూనియన్‌ కలిసి ఐక్య కూట మిగా పోటీ చేశాయి. టీడబ్ల్యూయూకి కాంగ్రెస్‌ మ ద్దతివ్వగా, సీపీఎం అనుబంధ ఎస్‌డబ్ల్యూఎఫ్‌ అదే కూటమితో కలిసి బరిలో దిగింది. ఈ కూటమి విజయం కోసం కాంగ్రెస్‌ అగ్రనేతలతోపాటు ఆయా జిల్లాల్లోని ఎమ్మెల్యేలు, ద్వితీయశ్రేణి నాయకులు ప్రచారం చేశారు. ఎంప్లాయీస్‌ కూటమికి సీపీఐ నాయకులతోపాటు టీఎంయూ థామస్‌రెడ్డి వర్గం ప్రచారం చేసింది. 11డిపోలకు 8డిపోల్లో సీ పీఐ కూటమి, 3 డిపోల్లో కాంగ్రెస్‌ కూటమి విజ యం సాధించినట్లు ఆయా సంఘాల నేతలు సంబ రాలు చేసుకున్నారు. ఈనెల 17న హైదరాబాద్‌లో అధికారికంగా ఫలితాలు వెల్లడించనున్నారు. ప్రస్తు తం రీజియన్‌స్థాయిలో క్లాస్‌–6 టీఎంయూకు గుర్తింపు హోదా దక్కగా, రాష్ట్రస్థాయిలో క్లాస్‌–3 ఎంప్లాయీస్‌ యూనియన్‌ గుర్తింపు దక్కించుకుంది.

కరీంనగర్‌ రీజియన్‌ పరిధిలో ని 11 డిపోలు, 1 వర్క్‌షాప్‌, ఆర్‌ఎం ఆఫీస్‌తో కలిపి మొత్తం 2,869 మంది ఓటర్లకు 2,802 మంది ఓటుహక్కు వినియోగించుకున్నారు. మొత్తం పోలింగ్‌శాతం 97.67గా నమోదైంది. 67 మంది మాత్రమే ఓటు హక్కు వినియోగించుకోలేదు. డిపోలవారీగా మంథని డిపోలో 178 మందికి 177 మంది ఓటు వేయడంతో అత్యధికంగా 99.44 శాతం పోలింగ్‌ నమోదైంది. కోరుట్ల డిపోలో 186 మందికి గాను 170 మంది ఓటు వేయడంతో అత్యల్పంగా 91.40శాతం పోలింగ్‌ నమోదైంది.

డిపోలు మొత్తం ఓట్లు పోలైన ఓట్లు శాతం

కరీంనగర్‌–1 351 343 97.72

కరీంనగర్‌–2 261 258 98.85

హుజూరాబాద్‌ 213 210 98.59

హుస్నాబాద్‌ 207 205 99.03

సిరిసిల్ల 208 206 99.04

వేములవాడ 218 213 97.71

జగిత్యాల 302 295 97.68

కోరుట్ల 186 170 91.40

మెట్‌పల్లి 177 171 96.61

గోదావరిఖని 412 400 97.09

మంథని 178 177 99.44

ఆర్‌ఎం ఆఫీస్‌ 40 39 97.50

వర్క్‌షాప్‌ 116 115 99.14

మొత్తం 2,869 2,802 97.67

ఎంప్లాయీస్‌ యూనియన్‌, టీఎంయూ కూటమికి రీజియన్‌, రాష్ట్రస్థాయి గుర్తింపు హోదా దక్కడంతో కరీంనగర్‌ బస్టాండ్‌ ఆవరణలో సంబరాలు అంబరాన్నంటాయి. సంబరాల్లో ఏఐటీయూసీ, టీఎంయూ నాయకులు ఓరుగంటి రమణారావు, టేకుమల్ల సమ్మయ్య, ఎంపీరెడ్డి, ఏవీఆర్‌రెడ్డి, కాళిదాస్‌, బి.మహేశ్వర్‌, శంకర్‌రెడ్డి, మనోహర్‌, సీహెచ్‌.శ్రీనివాస్‌, పుల్లయ్య తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement