ర్యాగింగ్‌కు పాల్పడితే చర్యలు | - | Sakshi
Sakshi News home page

ర్యాగింగ్‌కు పాల్పడితే చర్యలు

Oct 9 2026 1:38 AM | Updated on Oct 9 2026 1:38 AM

● డీఎస్పీ నాగేంద్రచారి

● డీఎస్పీ నాగేంద్రచారి

తంగళ్లపల్లి(సిరిసిల్ల): ర్యాగింగ్‌కు పాల్పడితే చట్టపరమైన చర్యలు తప్పవని సిరిసిల్ల డీఎస్పీ కె.నాగేంద్రచారి హెచ్చరించారు. మండలంలోని జిల్లెల్ల బాబుజగ్జీవన్‌రామ్‌ వ్యవసాయ కళాశాలలో గురువారం యాంటీ ర్యాగింగ్‌ కమిటీ, మోటివేషన్‌ క్లబ్‌ ఆధ్వర్యంలో ర్యాగింగ్‌ నిరోధంపై అవగాహన సదస్సు నిర్వహించారు. సిరిసిల్ల సీఐ కె.నాగేశ్వరరావు, తంగళ్లపల్లి ఎస్‌హెచ్‌వో సిరిసిల్ల అశోక్‌, కళాశాల అసోసియేట్‌ డీన్‌ ఎస్‌.ఉపేందర్‌, కళాశాల ఓఐఎస్‌ఏ ప్రతినిధులు పాల్గొన్నారు.

కులవివక్ష చూపితే చట్టపరమైన చర్యలు

ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): సోదర భావంతో కలిసిమెలిసి ఉండాలని, కులవివక్ష చూపితే చర్యలు తీసుకుంటామని సిరిసిల్ల డీఎస్పీ నాగేంద్రచారి పేర్కొన్నారు. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన కొంపల్లి సత్తవ్వకు సంబంధించిన కాంపౌండ్‌వాల్‌ను అదే గ్రామానికి చెందిన గన్న పద్మారెడ్డి, గన్న బాల్‌రెడ్డి ధ్వంసం చేయడంతోపాటు కులం పేరుతో దూషించిన ఘటనపై గురువారం విచారణ చేపట్టారు. ఎస్సై రమేశ్‌గౌడ్‌ ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement