ఇందిరమ్మ ఇళ్ల మంజూరు విషయంలో కమిటీలు పారదర్శకంగా ఎంపికచేయడంలో విఫలమయ్యాయి. కొన్ని గ్రామాల్లో అన్ని విధాలా అర్హతలున్న వారిని వదిలిపెట్టి అనర్హులకు ఇళ్లు మంజూరు చేయడం దారుణం. ఇప్పటికై నా గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్లపై విచారణ చేపట్టి నిజమైన నిరుపేదలకు అందించాలి.
– లింగంపెల్లి మనోజ్, యువ నాయకుడు
సర్పంచులకు తెలియడం లేదు
సర్పంచులకు తెలియకుండా మంజూరు చేయడం సరి కాదు. పెద్ద గ్రామాలు, చిన్న గ్రామాలను ఒకే విధంగా చూశారు. పెద్దగ్రామం కొలనూర్‌లో 20 మంది అర్హులు ఉండగా నాలుగే ఇచ్చారు. జనాభా ప్రాతిపదికన ఇళ్లు మంజూ రు చేసి, గ్రామపంచాయతీ ద్వారా లబ్ధిదారులకు అందిస్తే సర్పంచులకు గౌరవం దక్కేది.
– జలగం అరవింద్‌రావు, సర్పంచ్, కొలనూర్


