‘ఇందిరమ్మ’.. అర్హులకు
కోనరావుపేట మండలంలోని అధికార పార్టీ నాయకుడి భార్య, తల్లి పేరిట గతంలో ఇందిరమ్మ ఇళ్లు మంజూరుకాగా నిర్మించుకున్నాడు. అనంతరం ఆ రెండు ఇళ్లను అమ్మేసుకున్నాడు. ప్రస్తుతం రెండో విడతలో అతనికే మళ్లీ ఇందిరమ్మ ఇంటిని మంజూరు చేశారు. గ్రామంలో ఇప్పటికీ గుడిసెలో ఉంటున్న వారిని వదిలిపెట్టి ఒకే వ్యక్తికి మూడు ఇళ్లు ఎలా కట్టబెడతారంటూ అధికారపార్టీ నాయకులపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఈ ఫొటోలో ఉన్న వారు కోనరావుపేట మండలం మామిడిపల్లికి చెందిన బడుగు బాబు–అనిత దంపతులు. మొదటి విడతలో ఇందిరమ్మ ఇంటి కోసం దరఖాస్తు చేసుకున్నారు. దుబాయ్‌లో ఉన్న బాబు ఇల్లు మంజూరైతే నిర్మించుకుందామనే ఉద్దేశంతో స్వగ్రామానికి ఇటీవల వచ్చాడు. అయితే మొదటి విడతలో ఇల్లు రాలేదు. రెండో విడతలో వస్తుందనే ఆశతో ఉండగా గ్రామంలో 14 మందికి మంజూరైన ఇళ్లు బాబు దంపతులకు రాలేదు. సొంత వ్యవసాయభూమి లేకపోగా గుడిసెలో ఇద్దరు పిల్లలు, తల్లిదండ్రులతో కలిసి ఉంటున్నారు. కూలి పని చేసుకునే వీరు అన్ని విధాలా అర్హులు అని గ్రామస్తులు అంటున్నారు. అయినా వీరికి ఇందిరమ్మ ఇల్లు రాలేదు.


