క్షయ రహిత గ్రామాలను తీర్చిదిద్దాలి | - | Sakshi
Sakshi News home page

క్షయ రహిత గ్రామాలను తీర్చిదిద్దాలి

Oct 9 2026 1:38 AM | Updated on Oct 9 2026 1:38 AM

● కలెక్టర్‌ గరీమా అగ్రవాల్‌ ● టీబీ రహిత గ్రామాల సర్పంచులు, వైద్య సిబ్బందికి సర్టిఫికెట్ల ప్రదానం

● కలెక్టర్‌ గరీమా అగ్రవాల్‌ ● టీబీ రహిత గ్రామాల సర్పంచులు, వైద్య సిబ్బందికి సర్టిఫికెట్ల ప్రదానం

సిరిసిల్ల: క్షయ(టీబీ) రహిత గ్రామాలను తీర్చిదిద్దాలని కలెక్టర్‌ గరీమా అగ్రవాల్‌ కోరారు. కలెక్టరేట్‌లో గురువారం టీబీ ముక్త్‌ భారత్‌ అభియాన్‌ నిర్వహించారు. టీబీ లక్షణాలు, వైద్యపరీక్షలు, మందులు, పోషకాహార అంశాలపై అవగాహన కల్పించి, టీబీ ముక్త్‌ భారత్‌ అభియాన్‌ ప్రతిజ్ఞ చేశారు. 20 మంది క్షయ బాధితులకు పోషకాహారం కిట్లు పంపిణీ చేశారు. టీబీ ముక్త్‌ భారత్‌ అభియాన్‌లో ఎంపికై న గ్రామాల సర్పంచులు, వైద్యసిబ్బందికి ప్రశంసాపత్రాలు అందించి, అభినందించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో టీబీ రహిత 20 గ్రామాలను ఆదర్శంగా తీసుకొని ముందుకెళ్లాలని సూచించారు.

టీబీ రహిత గ్రామాలు ఇవే..

బోయినపల్లి మండలం రామన్నపేట, దేశాయిపల్లి, శాభాష్‌పల్లి, ఇల్లంతకుంట మండలం కిష్టారావుపల్లి, ఆరెపల్లి, గంభీరావుపేట మండలం హీరాలాల్‌తండా, పొన్నాలపల్లి, కోనరావుపేట మండలం గొల్లపల్లి, శివంగాళపల్లి, మర్తన్‌పేట, ముస్తాబాద్‌ మండలం గోపాలపల్లి, రుద్రంగి మండలం రూప్లానాయక్‌తండా, సర్పంచ్‌తండా, తంగళ్లపల్లి మండలం పాపయ్యపల్లి, వీర్నపల్లి మండలం బాబాయి చెరువు తండా, బావుసింగ్‌నాయక్‌ తండా, ఎర్రగడ్డతండా, జవహర్‌లాల్‌ నాయక్‌ తండా, వేములవాడ రూరల్‌ మండలం అచ్చన్నపల్లి, ఎల్లారెడ్డిపేట మండలం పోతిరెడ్డిపల్లి ఎంపికయ్యాయి. జిల్లా వైద్యాధికారి ఏంజెలా ఆల్ఫ్రెడ్‌ తదితరులు పాల్గొన్నారు.

ప్రభుత్వ భూములను రక్షించాలి

జిల్లాలో సమగ్ర భూసర్వే పక్కాగా చేయాలని, ప్రభుత్వ భూములను రక్షించాలని కలెక్టర్‌ కోరారు. భూభారతిలో భూముల రీసర్వే ప్రక్రియపై జిల్లాలోని డిప్యూటీ తహసీల్దార్లు, ఆర్‌ఐలు, జీపీఓలు, సర్వేయర్లు, లైసెన్డ్‌స్‌ సర్వేయర్లకు కలెక్టరేట్‌లో శిక్షణ ఇచ్చారు. రీ సర్వే ఉద్దేశం, ఉపయోగాలు, నిబంధనలపై అవగాహన కల్పించారు. భూముల రీ సర్వేకు జిల్లాలో 18 రోవర్‌ యంత్రాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ముందుగా గ్రామ సరిహద్దు సర్వే చేయాలని, రెవెన్యూ, నీటిపారుదల, అటవీ శాఖల అధికారులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. ప్రభుత్వ భూములను పరిరక్షించాలని స్పష్టం చేశారు. ఏడీ సర్వే అండ్‌ ల్యాండ్‌ రికార్డ్స్‌ శ్రీనివాస్‌, కలెక్టరేట్‌ పర్యవేక్షకులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement