ఆర్టీసీ గుర్తింపు పోరు | - | Sakshi
Sakshi News home page

ఆర్టీసీ గుర్తింపు పోరు

Oct 9 2026 1:38 AM | Updated on Oct 9 2026 1:38 AM

● ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికలకు సర్వం సిద్ధం ● హోరాహోరీగా పోటీ పడుతున్న రెండు కూటమిలు ● రీజియన్‌ పరిధిలో 2,870 మంది ఓటర్లు ● 13 బూత్‌లు, 37 మంది ఎన్నికల సిబ్బంది ● పోలింగ్‌కు ఏర్పాట్లు పూర్తిచేసిన అధికారులు రీజియన్‌ పరిధిలో ఓటర్లు

సాక్షిప్రతినిధి, కరీంనగర్‌/కరీంనగర్‌ టౌన్‌:

టీజీఎస్‌ ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. శుక్రవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు కరీంనగర్‌ రీజియన్‌ పరిధిలో పోలింగ్‌ జరగనుంది. పదేళ్ల సుదీర్ఘ విరామం తరువాత ప్రభుత్వం ఆర్టీసీలో ఎన్నికల నిర్వహణకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వగా కార్మికశాఖ ఏర్పాట్లు చేసింది. ఎన్నికల సంఘం 12 కార్మిక సంఘాలకు గుర్తులు కేటాయించగా, రీజియన్‌ పరిధిలో తొమ్మిది కార్మిక సంఘాలు పోటీ పడుతున్నాయి. ‘గుర్తింపు’ కోసం రెండు ఐక్యకూటమిలు హోరాహోరీగా ప్రచారం నిర్వహించాయి. టీడబ్ల్యూయూ కూటమి గెలుపును కాంగ్రెస్‌ చాలెంజ్‌గా తీసుకోగా.. ఎంప్లాయీస్‌ యూనియన్‌ కూటమికి గుర్తింపు దక్కాలని సీపీఐ, ఏఐటీయూసీ, థామస్‌రెడ్డివర్గం ప్రచారం నిర్వహించాయి.

ఉదయం నుంచి సాయంత్రం వరకు పోలింగ్‌

కరీంనగర్‌ రీజియన్‌ పరిధిలో నేటి ఉదయం 5 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్‌ జరగనుంది. 2,870 మంది కార్మికులు ఓటుహక్కు వినియోగించుకోనున్నారు. పోలింగ్‌ కోసం డిపోల వారీగా రీజినల్‌ మేనేజర్‌ కార్యాలయంలో పోలింగ్‌బూత్‌లు గుర్తించారు. బ్యాలెట్‌బాక్సులను కరీంనగర్‌లోని కార్మికశాఖ కార్యాలయం నుంచి పోలింగ్‌స్టేషన్లకు తరలించారు. కార్మికశాఖ డిప్యూటీ కమిషనర్‌ కోల ప్రసాద్‌ ఎన్నికల రిటర్నింగ్‌ అధికారిగా వ్యవహరించనున్నారు.

ప్రతి ఓటరుకు రెండు ఓట్లు

ప్రతి ఓటరు రెండు ఓట్లు వేయాలి. క్లాస్‌–3 (రాష్ట్ర), క్లాస్‌–6(రీజియన్‌)కు వేర్వేరుగా ఓట్లు వేయాల్సి ఉంటుంది. డ్యూటీలో ఉండి 9న పోలింగ్‌లో పాల్గొనే అవకాశం లేనివారు ఈ నెల 15,16 తేదీల్లో పోస్టల్‌ బ్యాలెట్‌ వినియోగించుకోవచ్చు. ఎన్నికల నిర్వహణకు 39మంది సిబ్బందిని నియమించారు. సాయంత్రం పోలింగ్‌ పూర్తికాగానే కౌంటింగ్‌ ఉంటుంది కానీ ఫలితాలు వెల్లడించరు. 15,16 తేదీల్లో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2గంటల పోస్టల్‌ బ్యాలెట్‌ పోలింగ్‌ ఉంటుంది. మధ్యాహ్నం 2గంటల తర్వాత కౌంటింగ్‌, తుది ఫలితాలు 17న హైదరాబాద్‌ బస్‌భవన్‌లో ప్రకటిస్తారు.

ముగిసిన ప్రచారం.. రంగంలోకి పొలిటికల్‌ పెద్దలు

ఆర్టీసీ గుర్తింపు ఎన్నికల ప్రచారం బుధవారం ముగిసింది. కార్మికశాఖ షెడ్యూల్‌ విడుదల చేసినప్పటి నుంచి యూనియన్లు జోరుగా ప్రచారం నిర్వహించాయి. కార్మిక సంఘాలతో పాటు ఆయా పార్టీల నాయకులు, ప్రజాప్రతినిధులు డిపోలవారీగా ప్రచారం చేపట్టారు. తెలంగాణ ఆర్టీసీ వర్కర్స్‌ యూనియన్‌, ఎన్‌ఎంయూ, టీఎంయూ ఐక్య కూటమి నేతలు అశ్వథ్థామరెడ్డి, మొగుళ్ల రాజిరెడ్డి, బొంతు రామ్మోహన్‌, వీఎస్‌.రావు, రీజియన్‌ గౌరవ అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి, జక్కుల మల్లేశం, వీరాంజనేయులు కరీంనగర్‌లో బహిరంగసభ నిర్వహించారు. ఎంప్లాయీస్‌ యూనియన్‌, తెలంగాణ మజ్దూర్‌ యూనియన్‌, నేషనల్‌ మజ్దూర్‌ యూనియన్‌ పక్షాన సీపీఐ నేత చాడ వెంకటరెడ్డి, ఓరుగంటి రమణరావు, ఎంపీ.రెడ్డి, మహేశ్వర్‌, ఏవీఆర్‌రెడ్డి, కాళీదాస్‌, మనోహర్‌ ప్రచారం నిర్వహించారు.

కరీంనగర్‌–1 డిపో

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement