సిరిసిల్లటౌన్/సిరిసిల్లఅర్బన్: పౌష్టికాహరం తీసుకోవడం ద్వారా గర్భిణీలు, తల్లీబిడ్డలు క్షేమంగా ఉంటారని సిరిసిల్ల మున్సిపల్ చైర్‌పర్సన్ జిందం కళ పేర్కొన్నారు. స్థానిక కళ్యాణలక్ష్మీ గార్డెన్స్‌లో గురువారం జిల్లా మహిళ, శిశు దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమశా ఖ ఆధ్వర్యంలో నిర్వహించిన పోషణ మాసం ముగింపు వేడుకల్లో పాల్గొన్నారు. వేములవా డ మున్సిపల్ చైర్మన్ రాజు, కౌన్సిలర్‌లు భాగ్యలక్ష్మి, రజిత, ఆకుల స్వప్న ఉన్నారు.
చట్టాలపై అవగాహనతోనే హక్కుల పరిరక్షణ
వీర్నపల్లి: ప్రజలకు చట్టాలపై అవగాహన కల్పించి, ప్రతి ఒక్కరికీ న్యాయం అందించా లనే ఉద్దేశంతో న్యాయ విజ్ఞాన సదస్సులు ని ర్వహిస్తున్నట్లు లోక్ అదాలత్ సభ్యుడు, న్యాయవాది ఆడెపు వేణు తెలిపారు. వీర్నపల్లిలో గురువారం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో న్యాయవిజ్ఞాన సదస్సు నిర్వహించారు. వేణు మాట్లాడుతూ ప్రతీ పౌ రుడికి న్యాయ అవగాహన అవసరమన్నారు. చట్టాలపై అవగాహన ఉంటేనే హక్కులను రక్షించుకోవచ్చన్నారు. లోక్ అదాలత్ సభ్యులు ఆంజనేయులు, న్యాయవాదులు మధుసూదన్, నరేశ్, ఎస్సై లక్ష్మణ్ పాల్గొన్నారు.
కొత్తచెరువు నాలాల కబ్జాపై ఫిర్యాదు
సిరిసిల్లటౌన్: కొత్తచెరువు నాలాలు, మత్తడి కబ్జాలపై ఏఐఎఫ్‌టీయూ (న్యూ) రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు సోమిశెట్టి దశరథం ఉన్నతాధికా రులకు ఫిర్యాదు చేశారు. ఈమేరకు గురువా రం సిరిసిల్లలోని పార్టీ ఆఫీసులో ప్రెస్‌మీట్లో మాట్లాడారు. కొన్నేళ్లుగా కబ్జాలపై స్థానిక అధికారులు, స్థానిక ఎమ్మెల్యే కేటీఆర్‌కు వినతిపత్రాలు ఇచ్చినా పట్టించుకోకపోవడంతో కబ్జాలు కొనసాగాయన్నారు. ఇప్పటికైనా చర్యలు తీసుకోకపోతే ఆందోళన చేపడతామని హెచ్చరించారు. నాయకులు గుజ్జే దేవదాస్, సలేంద్రి ఎల్లయ్య పాల్గొన్నారు.
భూ రీసర్వే లోపాలపై రైతుల నిరసన
చందుర్తి: భూ సమస్యల శాశ్వత పరిష్కారం కోసం చేపట్టిన భూభారతి రీసర్వేలో లోపాలు ఉన్నాయంటూ మండలంలోని అనంతల్లి రైతులు గురువారం నిరసన తెలిపారు. తహసీల్దార్ భూపతి గ్రామానికి రాగా సర్వే పత్రా ల పంపిణీ నిలిపివేయాలని వినతిపత్రం ఇ చ్చారు. పట్టాదారు పాసుపుస్తకాల్లోని వివరాల ప్రకారం సర్వేచేసి హద్దులు ఏర్పాటు చేయలేదన్నారు. మోకాపై ఉన్న భూములు సర్వే చేయడం ద్వారా ఒక్కో రైతుకు పది గుంటల నుంచి రెండెకరాల వరకు తేడా వస్తుందని తెలిపారు. రైతుల మధ్య హద్దుల సమస్యరాకుండా చూడాలని కోరారు. సర్పంచ్ చిలుక బాబు, రైతులు గసికంటి రాజు, జోగినిపల్లి చందు, ఐతం రాంరెడ్డి, తోట కృష్ణ, సలేంద్ర సత్తయ్య, రాజయ్య, రవి, పర్శరాములు, భూమయ్య, రాములు, కొమురయ్య, మల్లయ్య పాల్గొన్నారు.
బతుకమ్మకు భారీ ఏర్పాట్లు
వేములవాడ/వేములవాడరూరల్: వేములవా డలో శనివారం నుంచి ప్రారంభంకానున్న బ తుకమ్మ వేడుకలకు మూలవాగులో ము న్సిపల్ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేస్తున్నారు. బతుకమ్మఘాట్ వద్ద రూ.36లక్షలతో సౌకర్యాలు కల్పిస్తున్నట్లు మున్సిపల్ చైర్మన్ పుల్కం రాజు తెలిపారు. ఈమేరకు గురువా రం మేనేజర్ సంపత్‌రెడ్డి, కౌన్సిలర్లు, అధికా రులతో కలిసి బతుకమ్మ తెప్ప పరిసరాలు, ఘాట్ ప్రాంతాల్లో పనులు పరిశీలించారు. బతుకమ్మ ఆడే స్థలంలో విద్యుత్ దీపాల అలంకరణ, తెప్ప వద్ద సుందరీకరణ పనులు చేపట్టినట్లు పేర్కొన్నారు. ఇప్పటికే దాదాపు 90 శాతం పనులు పూర్తయ్యాయని, మిగిలిన పనులను త్వరగా పూర్తి చేస్తామన్నారు.


