కల్యాణ వైభోగమే..
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీరుక్మిణి, సత్యభామ సమేత వేణుగోపాలస్వామి కల్యాణాన్ని సోమవారం వైభవంగా నిర్వహించారు. ఎల్లారెడ్డిపేట గ్రామపంచాయతీ ఎదురుగా ఉన్న బాలాలయం నుంచి అశ్వ వాహనంపై రుక్మిణిసత్యభామ సమేత వేణుగోపాలస్వామిని ఊరేగించారు. ఏటా మాదిరిగానే పశువుల అంగడిబజార్ స్థలంలో మంటపాన్ని ఏర్పాటు చేసి స్వామివారి కల్యాణం జరిపించారు. అశ్విని ఆస్పత్రి ఎండీ డాక్టర్ జి.సత్యనారాయణస్వా–వసంత దంపతులు, మాజీ సర్పంచ్ నేవూరి వెంకట్‌రెడ్డి, విండో చైర్మన్ గుండారపు కృష్ణారెడ్డి, కాంగ్రెస్ మండల అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి, ఆలయ కమిటీ చైర్మన్ గుండం సుధాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. డాక్టర్లు జి.సత్యనారాయణస్వామి, అభినయ్ అన్నదానం చేశారు.
కల్యాణ వైభోగమే..


