రోడ్డెక్కిన రైతన్న
ఎల్లారెడ్డిపేట/ముస్తాబాద్: రైతులను రైస్ మిల్లర్లు నిలువు దోపిడీకి గురిచేస్తున్నారని నిరసిస్తూ సోమవారం ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో సిరిసిల్ల– కామారెడ్డి రహదారిపై బైఠాయించారు. నిర్వాహకులు తూకంలో మోసాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. జిల్లా పౌరసరఫరాల అధికారి చంద్రప్రకాష్ ఆందోళన విరమించాలని రైతులను కోరారు. శ్రీరాజరాజేశ్వర రైస్‌మిల్లులో విచారణ చేసిన అనంతరం నిర్వాహకులకు నోటీసులు జారీ చేశారు. దీంతో రైతులు ఆందోళన విరమించారు. ఆందోళనకు బీజేపీ నాయకులు సంఘీభావం తెలిపారు. జిల్లా ప్రధాన కార్యదర్శి పొన్నాల తిరుపతిరెడ్డి, మండల అధ్యక్షుడు రేపాక రామచంద్రారెడ్డి, నాయకులు పాల్గొన్నారు. కాగా, మూడు రోజులుగా కాంటాలు పెట్టడం లేదని ముస్తాబాద్ మండలం ఆవునూర్‌లో రైతులు ముస్తాబాద్–సిరిసిల్ల రహదారిపై బైఠాయించారు. రైతులను ఏపీఎం కల్యాణి, ఆర్‌ఐ రఘు, పోలీసులు శాంతింపజేశారు. మరో రైస్‌మిల్లుకు అలాంట్‌మెంట్ ఇప్పించామని, వెంటనే కాంటాలు ప్రారంభిస్తామని చెప్పడంతో రాస్తారోకో విరమించారు.


