రాజీయే రాజమార్గం
వేములవాడ: రాజీయే రాజమార్గమని, ఈనెల 15న ఏర్పాటు చేసే స్పెషల్ లోక్ అదాలత్‌ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి పుష్పలత పిలుపునిచ్చారు. సోమవారం వేములవాడ జూనియర్ సివిల్ కోర్టు హాలులో నిర్వహించిన సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ కార్యదర్శి రాధిక జైస్వాల్, వేములవాడ సీనియర్ సివిల్ జడ్జి అజయ్‌కుమార్‌జా దవ్, జూనియర్ సివిల్ జడ్జి జ్యోతిర్మయి, సిరిసిల్ల ఏఎస్పీ చంద్రయ్య, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు సదానందం తదితరులు పాల్గొన్నారు.
మత్స్యకార్మిక కుటుంబాల అభ్యున్నతే లక్ష్యం
కోనరావుపేట(వేములవాడ): మత్స్యకార్మిక కుటుంబాల ఆర్థిక అభ్యున్నతే ప్రభుత్వ లక్ష్యమని విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. సోమవారం మల్కపేట రిజర్వాయర్‌లో చేపపిల్లల పంపిణీ కార్యక్రమాన్ని ఇన్‌చార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్‌తో కలిసి ప్రారంభించారు. మల్కపేట రిజర్వాయర్‌లో 7 లక్షల 50 వేల చేపపిల్లలు వదిలారు. అనంతరం సుద్దాలలో సీసీఐ కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. వేములవాడ ఆర్డీవో రాధాబాయి, జిల్లా మత్స్యశాఖ అధికారి సౌజన్య, నీటిపారుదల శాఖ అధికారి కిశోర్‌కుమార్, డీఏవో అఫ్జల్‌బేగం, తహసీల్దార్ వరలక్ష్మి, ఎంపీడీవో స్నిగ్ధ, కిసాన్‌సెల్ అధ్యక్షుడు కేతిరెడ్డి జగన్మోహన్‌రెడ్డి, ఏఎంసీ చైర్మన్ కచ్చకాయల ఎల్లయ్య, డైరెక్టర్లు పాల్గొన్నారు.
సీసీఐ కొనుగోలు కేంద్రం ప్రారంభం
వేములవాడఅర్బన్: వేములవాడ మున్సిపల్ నాంపల్లి, సంకెపల్లి గ్రామాల్లోని సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రాలను సోమవారం విప్ ఆది శ్రీనివాస్, ఇన్‌చార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ ప్రారంభించారు.
గ్రీవెన్స్‌కు 23 ఫిర్యాదులు
సిరిసిల్లక్రైం: జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్ డే కార్యక్రమంలో ప్రజల నుంచి మొత్తం 23 ఫిర్యాదులు స్వీకరించామని ఎస్పీ మహేశ్ బీ గితే తెలిపారు. ఫిర్యాదులు స్వీకరించిన వెంటనే సమస్యలు పరిష్కరించాలని సంబంధిత పోలీస్ అధికారులకు సూచనలు జారీ చేశారు.
రాజీయే రాజమార్గం


