అర్జీలు పెండింగ్‌లో ఉండొద్దు
ఇన్‌చార్జి కలెక్టర్ గరిమా అగ్రవాల్
ప్రజావాణిలో 149 దరఖాస్తుల స్వీకరణ
సిరిసిల్లఅర్బన్: ప్రజావాణి దరఖాస్తులు ఎప్పటికప్పుడు పరిష్కరించాలని ఇన్‌చార్జి కలెక్టర్ గరిమా అగ్రవాల్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. మొత్తం 149 దరఖాస్తులు వచ్చాయి. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, దరఖాస్తులు పెండింగ్‌లో పెట్టవద్దని, సకాలంలో పరిష్కరించాలని అధికారులకు సూచించారు.
మాది బోయినిపల్లి మండలం నీలోజిపల్లి. మధ్యమానేరు ప్రాజెక్టులో ముంపునకు గురైంది. నష్టపరిహారం కింద రూ.7లక్షల 50 వేలు ప్రభుత్వం ఇచ్చింది. మాకు సంతానం లేరు. మా చెల్లె కుమారులు రాజు, శ్రీనివాస్ ఇద్దరు మమ్మల్ని పోషిస్తామని చెప్పి వచ్చిన డబ్బులను తీసుకున్నారు. ఇప్పుడు పోషించకుండా ఇంట్లో నుంచి వెళ్లిపోవాలని వేధిస్తున్నారు. డబ్బులు తీసుకొని మమ్మ ల్ని పోషించకుండా ఇబ్బందులకు గురిచేస్తున్న ఇద్దరిపై చర్యలు తీసుకోవాలి.
– కడుదుల రుక్కమ్మ, మల్లయ్య దంపతులు
సిరిసిల్ల పట్టణ శివారులోని మానేరువాగు బ్రిడ్జి నుంచి పంపుహౌజ్ వరకు కరకట్టపై పెరిగిన చెట్లను తొలగించాలి. చెట్లు పెరగడంతో కరకట్ట లీకయ్యే ప్రమాదం ఉంది. చేపలు పట్టేందుకు కట్ట పైనుంచి వెళ్లడానికి వీలులేకుండా ఉంది. వెంటనే సమస్య పరిష్కరించాలి.
– గంగపుత్ర మత్య్సకారుల సంఘం బాధ్యులు, సిరిసిల్ల
దీపావళి సందర్భంగా కోనరావుపేట మండలం నాగారంలో గ్రామస్తులందరూ పొట్టిగుట్టపై కాషాయ జెండా ప్రతిష్టించి పూజ కార్యక్రమం నిర్వహించారు. ఇది గ్రామ ప్రజల ఆధ్యాత్మిక విశ్వాసానికి సంబంధించినది. కాగా, గ్రామ కార్యదర్శి జెండాను తొలగించారు. ఈ ఘటన గ్రామంలోని హిందువుల మత భావాలను తీవ్రంగా దెబ్బతీసింది. గ్రామంలో శాంతి నెలకొనాలంటే కార్యదర్శిని వెంటనే బదిలీ చేయాలి. – నాగారం గ్రామస్తులు
మధ్యమానేరులో ముంపునకు గురైన చింతల్‌ఠాణ రేణుక ఎల్లమ్మ ఆలయం నష్టపరిహారం ఇంత వరకు ఇవ్వలేదు. గుడికి సంబంధించిన చెక్కు భూ సేకరణ అధికారి వద్ద ఉన్నట్లు తెలిసింది. ఇప్పటికై నా నష్టపరిహారం అందించాలి.
– గీతపారిశ్రామిక సహకార సంఘం బాధ్యులు, చింతల్‌ఠాణ
అర్జీలు పెండింగ్‌లో ఉండొద్దు
అర్జీలు పెండింగ్‌లో ఉండొద్దు
అర్జీలు పెండింగ్‌లో ఉండొద్దు
అర్జీలు పెండింగ్‌లో ఉండొద్దు


