16 పోస్టులు.. 904 దరఖాస్తులు | - | Sakshi
Sakshi News home page

16 పోస్టులు.. 904 దరఖాస్తులు

Jun 16 2025 5:14 AM | Updated on Jun 16 2025 5:14 AM

16 పోస్టులు.. 904 దరఖాస్తులు

16 పోస్టులు.. 904 దరఖాస్తులు

సిరిసిల్ల/సిరిసిల్లకల్చరల్‌: జిల్లా సంక్షేమ అధికారి ఆఫీస్‌లో వివిధ పోస్టులకు ఆదివారం ఇంటర్వ్యూలు నిర్వహించారు. జిల్లాలో మొత్తం 16 పోస్టులకు ఇటీవల నోటిఫికేషన్‌ విడుదల చేసి, దరఖాస్తులు ఆహ్వానించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన 904 దరఖాస్తులు వచ్చాయి. కలెక్టరేట్‌లో ఆరు రకాల పోస్టులు డిస్ట్రిక్ట్‌ చైల్డ్‌ ప్రొటెక్షన్‌ ఆఫీసర్‌, ప్రొటెక్షన్‌ ఆఫీసర్లు(2), లీగల్‌ ఆఫీసర్‌, కౌన్సిలర్‌, సోషల్‌ వర్కర్ల కోసం కలెక్టర్‌ సందీప్‌ కుమార్‌ ఝా ఇంటర్వ్యూలు నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్హత, పని అనుభవం తదితర అంశాలపై అడిగి తెలుసుకున్నారు. మిగతా 10 రకాల పోస్టులకు సోమ, మంగళవారాల్లో ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు జిల్లా సంక్షేమ అధికారి లక్ష్మీరాజం తెలిపారు. 16 పోస్టులకు 900 మంది తరలిరావడంతో కలెక్టరేట్‌ కిక్కిరిసిపోయింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement