ఆధ్యాత్మిక చింతనతో మానసిక ప్రశాంతత
వేములవాడ: ఆధ్యాత్మిక చింతనతో మానసిక ప్రశాంతత లభిస్తుందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. ఆదివారం పట్టణంలోని సాయినగర్‌లో గల తన గృహంలో బ్రాహ్మణోత్తముల మంత్రోచ్చరణల మధ్య వారాహిపూజ, హోమం ఘనంగా నిర్వహించారు. వారాహి అమ్మవార్ల దీవెనలతో అందరూ సంతోషంగా ఉండాలన్నారు. సకాలంలో వర్షాలు కురిసి పాడిపంటలు బాగుండాలనీ, ప్రజలంతా ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలతో తులతూగాలని వేడుకున్నారు. కార్యక్రమంలో నియోజకవర్గంలోని ప్రముఖ నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.
వయోధికుల చట్టంపై ప్రచారం చేయాలి
సిరిసిల్లకల్చరల్: వయోవృద్ధుల హక్కుల పరిరక్షణకు సంబంధించి విస్తృత ప్రచారం చేయాలని ఆల్ సీనియర్ సిటిజన్ల సంఘం తీర్మానించింది. ఆదివారం స్థానిక వస్త్ర, వ్యాపార సంఘ భవనంలో వయోధికుల హక్కులకు సంబంధించిన పోస్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సంఘం అధ్యక్ష, కార్యదర్శులు చేపూరి బుచ్చయ్య, డాక్టర్ జనపాల శంకరయ్య మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో పోస్టర్ ప్రదర్శించేలా యంత్రాంగం చర్యలు తీసుకోవాలన్నారు. వయోవృద్ధులు సైతం తమ బాధలను సంఘ ప్రతినిధులకు తెలియజేస్తే అవసరమైన సహాయాన్ని అందిస్తామన్నారు. ఏనుగుల ఎల్లయ్య, దొంత దేవదాస్, గుడ్ల శ్రీధర్, కై లాసం, విద్యాసాగర్, గజ్జెల్లి రామచంద్రం తదితరులు పాల్గొన్నారు.
ఆలయ అధికారులపై చర్యలు తీసుకోవాలి
వేములవాడ: ఆలయంలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగం చేసే తన కుమారుడు పెంట ఓంకార్ అధికారుల వేధింపులు భరించలేక గతనెల 30న ఆత్మహత్య చేసుకున్నాడని పేర్కొంటూ అతడి తల్లి లక్ష్మి ఆధ్వర్యంలో కుటుంబ సభ్యులు, బంధువులు ఆదివారం ఈవో కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. ఇంజినీరింగ్ విభాగంలో పని చేస్తున్న క్రమంలో రాంకిషన్‌రావు, నాగరాజు తన కుమారుడిని సొంత పనులకు వాడుకుంటూ వేధింపులకు గురి చేశారని, వారి వల్లే తన కుమారుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడని, విచారణ జరిపించి సదరు అధికారులపై చర్యలు తీసుకుని తనకు న్యాయం చేయాలని ఆలయ ఈవోకు వినతిపత్రం సమర్పించారు. ఈ విషయమై రాంకిషన్‌రావును వివరణ కోరగా.. భక్తుల రద్దీ సమయంలో నీటి సరఫరాలో ఏర్పడిన ఇబ్బందులపై ఓంకార్‌ను ప్రశ్నించామని, ఇందుకు తను సంజాయిషి రాసి ఇచ్చాడని, ఓంకార్ మృతికి తమకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు.
ఆధ్యాత్మిక చింతనతో మానసిక ప్రశాంతత
ఆధ్యాత్మిక చింతనతో మానసిక ప్రశాంతత


