లెప్రసీ సర్వే పకడ్బందీగా నిర్వహించాలి
బోయినపల్లి(చొప్పదండి): కుష్ఠువ్యాధి నిర్మూలనలో భాగంగా నిర్వహించే కుష్ఠి వ్యాధిగ్రస్తుల గుర్తింపు ఉద్యమం ఇంటింటి సర్వేను ఏఎన్‌ఎంలు, ఆశకార్యకర్తలు పకడ్బందీగా నిర్వహించాలని రాష్ట్ర కుష్టు వ్యాధి నిర్మూలన అధికారి, రాష్ట్ర పరిశీలకురాలు డాక్టర్ సుజాత పేర్కొన్నారు. మండలంలోని విలాసాగర్‌లో ఇంటింటి సర్వేను శుక్రవారం పరిశీలించారు. ఆమె మాట్లాడుతూ ఈనెల 31 వరకు జిల్లాలో స్పర్శ లేని రాగి రంగు గల మచ్చలను గుర్తించే సర్వే జరుగుతుందని తెలిపారు. ఏఎన్‌ఎంలు, సూపర్‌వైజర్లు, వైద్యాధికారులు సర్వేను పరిశీలించి రిపోర్టును జిల్లా వైద్యాధికారి కార్యాలయానికి పంపించాలని సూచించారు. కుష్ఠురహిత జిల్లాను చేయాలన్నారు. ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ అనిత, డీపీఎంవో సీహెచ్.శ్రీనివాస్, దేవుసింగ్, హెచ్‌ఈఓబీ మోహన్ పాల్గొన్నారు.


