వెల్లివిరిసిన భక్తి పారవశ్యం
సిరిసిల్లటౌన్: శ్రీశాల క్షేత్రం భక్తి పారవశ్యంలో తేలియాడింది. ధనుర్మాసోత్సవాల్లో భాగంగా శుక్రవారం ఆండాళమ్మ సేవా నేత్రపర్వంగా జరిగింది. సిరిసిల్ల వెంకటేశ్వర స్వామి ఆలయంలో అశేష భక్తుల సమక్షంలో రాత్రి వేళలో ఆండాళమ్మ సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆలయ ఈవో మారుతిరావు, ఏఈవోలు పీసరి రవీందర్, కూనబోయిన సత్యం, ప్రధాన అర్చకులు మాడంరాజు కృష్ణమాచార్యులు, జయవర్ధనాచార్యులు పాల్గొన్నారు.
వేములవాడరూరల్: వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి దేవస్థానం నుంచి డిప్యూటేషన్, ట్రాన్స్‌ఫర్‌పై వెళ్లిన ఉద్యోగులను తిరిగి మాతృసంస్థకు రప్పించాలని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్‌కు ఆలయ ఉద్యోగుల యూనియన్ తరఫున శుక్రవారం విన్నవించారు. పెన్షన్ డిపాజిట్లను ప్రభుత్వం ద్వారా పెంచే విషయంలో చర్యలు తీసుకోవాలని కోరారు.
తంగళ్లపల్లి(సిరిసిల్ల): వృద్ధాప్యం శాపం కాదని..సహజమైన జీవన ప్రక్రియగా.. గౌరవంగా భావించాలని సైకాలజిస్ట్ కనుకుంట్ల పున్నంచందర్ పేర్కొన్నారు. మండేపల్లిలోని ప్రభు త్వ వృద్ధాశ్రమంలో హెల్పింగ్‌హార్ట్స్ వెల్ఫేర్ సొ సైటీ, తెలంగాణ సైకాలజిస్ట్స్ అసోసియేషన్ సంయుక్తంగా శుక్రవారం వృద్ధులకు కౌన్సెలింగ్ నిర్వహించారు. పున్నంచందర్ మాట్లాడుతూలీ వయసులో సహజంగా కనిపించే ఒంటరితనం, ఆందోళన, నిద్రలేమి వంటి సమస్యలను సానుకూల దృక్పథంతో అధిగమించాలన్నారు. వృద్ధుల అనుభవాలు, మాటలకు తగిన విలువ ఇవ్వాలన్నారు. హెల్పింగ్‌హార్ట్స్ అధ్యక్షుడు అలువల ఈశ్వర్, అడ్వకేట్ దాసరి తిరుమల, ఏలగొండ ఆంజనేయులు, ఆశ్రమ కోఆర్డినేటర్ మమత పాల్గొన్నారు.
వేములవాడరూరల్: వేములవాడలోని శ్రీరాజరాజేశ్వరస్వామి దేవస్థానంలో శుక్రవారం ఆలయ సిబ్బందికి సీపీఆర్‌పై అవగాహన కల్పించారు. భీమేశ్వరసదన్‌లో ఎస్‌పీఎఫ్, హోంగార్డు, ఆలయ సిబ్బందికి.. అత్యవసర పరిస్థితుల్లో సీపీఆర్ ఎలా చేయాలో చూపించారు. వైద్యులు నాగరాజన్, చీకోటి సంతోష్, దివ్య, రాకేశ్, లయన్స్ క్లబ్ సభ్యుడు చీకోటి శ్రీనివాస్, ఆలయ డీఈ రఘునందన్, ఏఈవో శ్రావణ్‌కుమార్, ఏఈ రామకృష్ణారావు, పర్యవేక్షకులు శ్రీనివాస్‌శర్మ తదితరులు పాల్గొన్నారు.
వేములవాడరూరల్: మొబైల్‌యాప్‌లో యూరియా కొనుగోళ్లు చేయొచ్చని జిల్లా వ్యవసాయ అధికారి అఫ్జల్‌బేగం పేర్కొన్నారు. వేములవాడరూరల్ మండలం హన్మాజిపేట, మర్రిపల్లి, వట్టెంల రైతువేదికల్లో శుక్రవారం రైతులకు అవగాహన కల్పించారు. అఫ్జల్‌బేగం మాట్లాడుతూ మొబైల్ యాప్ ద్వారా యూ రియాను కొనుగోలు చేసే విధానాన్ని రైతులకు వివరించారు. బుకింగ్ పూర్తయిన వెంటనే బుకింగ్ ఐడీ లభిస్తుందని, దాన్ని చూపించి యూరియాను పొందవచ్చని తెలిపారు. జిల్లా వ్యవసాయ అధికారి అఫ్జల్‌బేగం, మండల వ్యవసాయ అధికారి వినీత, ఏఈవోలు దీపిక, అనూష, మసూద్ పాల్గొన్నారు.
వెల్లివిరిసిన భక్తి పారవశ్యం
వెల్లివిరిసిన భక్తి పారవశ్యం


