రద్దీకి అనుగుణంగా ఏర్పాట్లు చేయాలి
● ఇన్‌చార్జి కలెక్టర్ గరీమా అగ్రవాల్ ● వేములవాడ ఆలయాల విస్తరణ పనులపై సమీక్ష
సిరిసిల్ల: వేములవాడలో భక్తుల రద్దీకి అనుగుణంగా ఏర్పాట్లు చేయాలని ఇన్‌చార్జి కలెక్టర్ గరీమా అ గ్రవాల్ ఆదేశించారు. శ్రీరాజరాజేశ్వరస్వామి, బద్ది పోచమ్మ ఆలయాల విస్తరణ పనులు, భీమేశ్వర ఆలయంలో భక్తులకు వసతుల కల్పనపై కలెక్టరేట్ నుంచి శుక్రవారం వీడియోకాన్ఫరెన్స్‌లో సమీక్షించా రు. ఆర్‌అండ్‌బీ సీఈ రాజేశ్వరరెడ్డి, ఈఈ నరసింహాచారి, డీఈఈ శాంతయ్య, వీటీఏడీఏ సెక్రటరీ అన్సార్, డీఈఈ రఘునందన్ పాల్గొన్నారు.
అప్రమత్తతోనే నష్ట నివారణ
అప్రమత్తతతోనే విపత్తుల సమయంలో ప్రాణనష్టాన్ని నివారించవచ్చని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు పేర్కొన్నారు. హైదరాబాద్ నుంచి శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. ప్రకృతి విపత్తుల నిర్వహణకు సంబంధించి మాక్ ఎక్సర్‌సైజ్ నిర్వహణ, వైపరీత్యాల నివారణ నిర్వహణ చర్యలపై జాతీయ విపత్తుల నిర్వహణ ప్రాధికారసంస్థ(నేషనల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ) అధికారులతో కలిసి మాట్లాడారు. ఇన్‌చార్జి కలెక్టర్ గరీమా అగ్రవాల్, అదనపు కలెక్టర్ గడ్డం నగేశ్, ఏఎస్పీ చంద్రయ్య, ఆర్డీవోలు వెంకటేశ్వర్లు, రాధాభాయ్ తదితరులు పాల్గొన్నారు.
మత్స్యకారులకు ప్రమాదబీమా సొమ్ము
ప్రధానమంత్రి మత్స్య సంపద యోజనలో గ్రూప్ ప్రమాద బీమా పత్రాలను ఇద్దరికి కలెక్టరేట్‌లో ఇన్‌చార్జి కలెక్టర్ గరీమా అగ్రవాల్ అందించారు. కోనరావుపేట మండలం కొలనూర్‌కు చెందిన కూన తిరుపతి ప్రమాదవశాత్తు మృతిచెందారు. అతడి భార్య కూన లావణ్యకు రూ.5 లక్షల బీమాపత్రాన్ని అందించారు. గంభీరావుపేట మండలం సముద్రలింగాపూర్‌కు చెందిన కుంట రమేశ్ ప్రమాదవశాత్తు మరణించగా.. అతడి తల్లి కుంట మల్లవ్వకు రూ.5లక్షల ప్రమాదబీమా చెక్కును పంపిణీ చేశారు. జిల్లా మత్స్యశాఖ అధికారి సౌజన్య, మత్స్యకారుల సహకార సంఘం అధ్యక్షుడు మామిండ్ల అంజయ్య, చింతకింది పోచయ్య, కార్యదర్శి సంతోష్ పాల్గొన్నారు.


