మెప్పించి.. రప్పించేలా..
● ప్రభుత్వ విద్యపై ఉపాధ్యాయుల విస్తృత ప్రచారం ● ప్రవేశాలు వచ్చేలా కృషి ● తల్లిదండ్రులకు అవగాహన
సిరిసిల్ల ఎడ్యుకేషన్: ప్రభుత్వ స్కూళ్లలో విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు ఉపాధ్యాయులు బడిబాట కార్యక్రమం ద్వారా కృషి చేస్తున్నారు. సర్కార్ బడుల్లో కల్పిస్తున్న వసతి సౌకర్యాలను వివరించడంతోపాటు బోధన చేసే అధ్యాపకుల నైపుణ్యతను తె లుపుతూ నూతన విద్యార్థులను ఆకర్షించేలా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మరో ఐదు రోజులపాటు బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించి ప్రభు త్వ పాఠశాలల్లో కనీస సంఖ్యలో విద్యార్థులు ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పది రోజుల్లో దా దాపు 630పైగా అడ్మిషన్లు నమోదు చేసినట్లు గణాంకాలు ఉన్నాయి.
ఆకర్షించే విధంగా..
పాఠశాలలకు విద్యార్థులు ఆనందంగా వచ్చేలా స్కూల్ ఆవరణను ఆకర్షణీయంగా అలంకరించి స్వాగత తోరణాలను ఏర్పాటు చేశారు. మరికొందరు ఉపాధ్యాయులు ప్లకార్డులతో స్వాగతం పలుకుతున్నారు. ప్రాథమిక పాఠశాలల్లో ఆటపాటలతో కూడిన విద్యనందిస్తామంటూ చెప్పే ఉపాధ్యాయులు ఒకవైపు ఉంటే ఉన్నత పాఠశాలల్లో ల్యాబ్ సౌకర్యాలతో ప్రాక్టికల్ మెథడ్‌లో విద్యాబోధన చేస్తామని స్కూల్ అసిస్టెంట్ టీచర్లు భరోసా ఇస్తూ, ప్రభుత్వ పాఠశాలల్లోనే సమర్థవంతమైన బోధన ఉంటుందని తల్లిదండ్రులకు వివరించి అడ్మిషన్లు చేర్చుకుంటున్నారు.
సమావేశాలు.. సామూహిక అక్షభ్యాసం
విద్యార్థులకు తాము అందించే సేవలను వివరించేలా పాఠశాలల ఆవరణలోనే అమ్మ ఆదర్శ కమిటీల సాయంతో తల్లిదండ్రులకు సమావేశాలు నిర్వహిస్తున్నారు. సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమాలు చేపడుతున్నారు. విద్యార్థులకు ప్రభుత్వం అందించే నోటుబుక్కులు, పుస్తకాలు పంపిణీ చేస్తున్నారు.
ఒకే ఒక్కడు.. కపిల నరేశ్
తాను ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పని చేస్తున్న పా ఠశాలలోనే తన కూతురు సహస్రాన్వితను మూడో తరగతిలో చేర్చి ఉపాధ్యాయులు అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు కపిల నరేశ్. తన కూతురు పూర్వ ప్రాథమిక విద్యను అంగన్వాడీ పాఠశాలలో చదివిందని, కొన్ని అనివార్య కారణాల వల్ల ఒక ఏడాది మాత్రమే ప్రైవేటు పాఠశాలలో చదివి మళ్లీ తాను పనిచేస్తున్న చందుర్తి ప్రభుత్వ పాఠశాలలో మూడో తరగతిలో చేర్చినట్లు నరేశ్ తెలిపాడు. ఉపాధ్యాయుల సహకారంతో చాలాసార్లు తన కూతురు స్వ గ్రామం తిమ్మాపూర్‌కు వెళ్లి ప్రభుత్వ బడిలో చది విందని, ఈ ఏడాది తాను చందుర్తిలో పనిచేయడం వల్ల తనతోనే పాఠశాలకు వస్తుందని ఆనందంగా తెలిపాడు.
15 ఎస్‌ఆర్‌ఎల్ 153: ఇటీవల తన కూతురును పభుత్వ పాఠశాలలో చేర్చిన ఉపాధ్యాయుడు నరేశ్


