చిన్నారిని చిదిమేసిన కారు.. శోకసంద్రంలో తల్లిదండ్రులు.. | - | Sakshi
Sakshi News home page

చిన్నారిని చిదిమేసిన కారు.. శోకసంద్రంలో తల్లిదండ్రులు..

Oct 9 2023 1:40 AM | Updated on Oct 9 2023 9:44 AM

- - Sakshi

ధర్నా చేస్తున్న చిన్నారి బంధువులు, గ్రామస్తులు - చిన్నారి స్వాతి(ఫైల్‌)

రాజన్న సిరిసిల్ల: మండలంలోని గాజులపల్లిలో ఆరేళ్ల చిన్నారిని అతివేగంగా వచ్చిన కారు చిదిమేసింది. ఈ ప్రమాదంలో చుట్టపుచూపుగా వచ్చిన చిన్నారి మృతితో గాజు లపల్లిలో విషాదం నిండింది. మహబూబాబాద్‌ జిల్లా కేసముద్రం పట్టణానికి చెందిన కొట్టెం పద్మ–రామారావు దంపతుల కూతురు స్వాతి(6)తో కలిసి గాజులపల్లిలో ఉంటున్న సమీప బంధువుల ఇంటికి ఆదివారం వచ్చారు.

ఈ క్రమంలో మధ్యాహ్నం ఎల్లారెడ్డిపేటకు చెందిన ఓ ప్రముఖుడు తన కారులో సిరిసిల్ల నుంచి మండల కేంద్రానికి వస్తుండగా రోడ్డు దాటుతున్న స్వాతిని అతివేగంగా ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో తల పగిలిపోవడంతో చిన్నారి అక్కడికక్కడే మృతిచెందింది. కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఎస్సై రమాకాంత్‌ అక్కడికి చేరుకొని కారు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం పోస్టుమార్టం కోసం స్వాతి మృతదేహాన్ని సిరిసిల్ల ఏరియా ఆస్పత్రికి తరలించారు. న్యాయం చేయాలంటూ కుటుంబీకులు, గ్రామస్తులు సిరిసిల్ల–కామారెడ్డి రోడ్డుపై ధర్నా చేశారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement