న్యూస్‌రీల్
మున్సిపల్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో సాగిన పోలీసుల పక్షపాత ధోరణి పంచాయతీ పోరులోనూ పునరావృతమవుతోంది. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికల్లో పోటీ చేయాల్సిన అభ్యర్థులను నామినేషన్లు వేయొద్దని, వేసినవి వెనక్కి తీసుకోవాలని పోలీసులే బెదిరింపులకు దిగుతున్నారు. ‘మీ ప్రభుత్వం లేదు.. పోటీ చేసి ఎందుకు ఇబ్బందులు పడతారు.. రాజీ పడండి’ అంటూ భయ రాజకీయాలకు తెరతీస్తున్నారు. నామినేషన్లు వేయొద్దని ఒకచోట.. వేసినవి వెనక్కి తీసుకోవాలని మరోచోట.. ప్రచారం చేయొద్దని ఇంకోచోట పోలీసులే ఆంక్షలు విధిస్తున్నారు. వినకుంటే గంజాయి, అక్రమ మద్యం కేసులు.. చివరకు ఎన్‌కౌంటర్ చేస్తామంటూ హెచ్చరికలు చేస్తున్నారు. ప్రజాస్వామ్యానికి రక్షణగా నిలవాల్సిన ఖాకీలే అధికార పార్టీకి ప్రైవేటు సైన్యంలా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.


