ప్రకృతి వ్యవసాయ క్షేత్రాల పరిశీలన | - | Sakshi
Sakshi News home page

ప్రకృతి వ్యవసాయ క్షేత్రాల పరిశీలన

Oct 14 2026 4:11 AM | Updated on Oct 14 2026 4:11 AM

కొత్తపట్నం: మండలంలోని కొత్తపట్నం, రంగాయపాలెంలో ప్రకృతి వ్యవసాయం చేస్తున్న క్షేత్రాలను ఎంఎస్‌ స్వామినాథన్‌ పరిశోధన సంస్థ బృందం మంగళవారం పరిశీలించారు. జిల్లా ప్రాజెక్టు మేనేజర్‌ సుభాషిణి పర్యవేక్షణలో ఎంఎస్‌ స్వామినాథన్‌ పరిశోధనా సంస్థకు చెందిన ఏడుగురు సభ్యుల బృందం అయిన డాక్టర్‌ ఈడీ ఇజ్రాయెల్‌ అలివర్‌ కింగ్‌, డాక్టర్‌ గోపినాథ్‌, ప్రశాంత్‌ పరిడా, డాక్టర్‌ త్రిప్తి, డాక్టర్‌ మీరా సుందరరాజన్‌, నందీష్‌, శ్రీకాంత్‌రెడ్డి, అంజలి వ్యవసాయ క్షేత్రాలను సందర్శించారు. కొత్తపట్నం గ్రామంలో అంకమ్మతల్లి జీవ వనరుల కేంద్రాన్ని సందర్శించిన బృందానికి, కేంద్రం సభ్యులు కషాయాలు, ద్రావణాల తయారీ విధానాన్ని ప్రదర్శించి వివరించారు. అలాగే ప్రకృతి వ్యవసాయంలోని తొమ్మిది సార్వత్రిక సూత్రాలను వివరించి వాటి ప్రాముఖ్యతను తెలిపారు. రామలింగం జ్యోతి కాటా సురేంద్ర సాగు చేస్తున్న ప్రకృతి వ్యవసాయ పంటలను పరిశీలించి రసాయన వ్యవసాయానికి, ప్రకృతి వ్యవసాయానికి మధ్య ఉన్న తేడాలు, సాగు పద్దతులు, రైతుల అనుభవాల గురించి అడిగి తెలుసుకున్నారు. మహిళా సంఘాల ద్వారా ప్రకృతి వ్యవసాయాన్ని ఎలా ముందుకు తీసుకెళ్తున్నారో మహిళా సంఘ సభ్యులతో బృందం నేరుగా మాట్లాడి తెలుసుకున్నారు. ఆరోగ్యం పోష కాహారం విభాగం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రకృతి వ్యవసాయ ఫుడ్‌బాస్కెట్‌ కార్యక్రమాన్ని పరిశీలించారు. కార్యక్రమంలో పరిశోధనా సంస్థ బృంద సభ్యులు రైతు సాధికార సంస్థ రాష్ట్ర కార్యాలయ ప్రతినిధులు, జిల్లా ప్రాజెక్టు మేనేజర్‌ సుభాషిణి, ప్రకృతి వ్యవసాయ సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement