చీమకుర్తి రూరల్: చీమకుర్తి మున్సిపాలిటీలోని 28 వార్డులకు రిజర్వేషన్లు కేటాయించారు. ఎస్టీ, ఎస్సీ, బీసీ, మహిళలు, జనరల్ కేటగిరీల వారీగా వార్డులను విభజించారు. రిజర్వేషన్ల వివరాలు ఈ విధంగా ఉన్నాయి.
ఎస్టీ: 2 వార్డులు
ఎస్టీ మహిళకు 15వ వార్డు, జనరల్‌కు 25వ వార్డు కేటాయించారు.
ఎస్సీ: 4 వార్డులు
ఎస్సీ మహిళలకు 1, 5వ వార్డులు, జనరల్‌కు 4, 6వ వార్డులు కేటాయించారు.
బీసీ: 8 వార్డులు
బీసీ మహిళలకు 8, 10, 21, 23వ వార్డులు, జనరల్‌కు 9, 19, 20, 26వ వార్డులు కేటాయించారు.
జనరల్ మహిళలు: 7 వార్డులు
3, 11, 13, 14, 16, 24, 27వ వార్డులు మహిళలకు కేటాయించారు.
అన్‌రిజర్వుడ్ జనరల్: 7 వార్డులు
2, 7, 12, 17, 18, 22, 28వ వార్డులను అన్‌రిజర్వుడ్ జనరల్ కేటగిరీకి కేటాయించారు.
మద్దిపాడు: మండల కేంద్రం మద్దిపాడు బీసీకాలనీకి చెందిన యువకునిపై పోక్సో కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ వెంకట సూర్య తెలిపారు. బీసీ కాలనీకి చెందిన చెల్లి వరస అయ్యే 14 సంవత్సరాల బాలికపై యువకుడు అత్యాచార యత్నం చేయడంతో బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు యువకునిపై పోక్సో కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు.
యర్రగొండపాలెం: దసరా శరన్నవరాత్రి ఉత్సవంలో భాగంగా త్రిపురాంతకంలో వెలసిన బాల త్రిపుర సుందరీదేవి అమ్మవారు మంగళవారం చంద్రఘంట అలంకరణలో భక్తులకు దర్శనం ఇచ్చారు. వేదపండితులు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. రాత్రి బాల త్రిపుర సుందరీదేవిని వ్యాఘ్ర వాహనంపై ఊరేగించారు.


